ఆ ఫోటోను చూస్తే కోతులకు ఎందుకంత భయం? వీడియో
రైతులకు కోతుల బెడద తప్పడం లేదు. వనంలో ఉండాల్సిన వానరాలు జనావాసాలు, పంట పొలాల మధ్య తిరుగుతూ, రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఓ రైతు తన మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి వినూత్న రీతిలో ఆలోచించాడు. కొండ ముచ్చుల ప్లెక్సీలను ఏర్పాటు చేసి, తన పంటను కాపాడుకుంటున్నాడు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామానికి చెందిన సంపత్ అనే రైతు మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పంట చేతి కొచ్చిన సమయంలో పదుల సంఖ్యలో వానరాలు వచ్చి మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నాయి. అయితే తన పంటను కోతుల బారి నుండి కాపాడుకునేందుకు కొండముచ్చుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేయించాడు. ఆ బ్యానర్లను మొక్కజొన్న పంట చుట్టూ ఏర్పాటు చేశాడు. దీంతో వానరాల బెడద తగ్గిందని రైతు సంపత్ తెలిపాడు. సంపత్ వినూత్న ఆలోచన పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంపత్ ఇగురాన్ని చూసిన మరికొంత మంది రైతులు కూడా కొండముచ్చు బ్యానర్లను తయారు చేయించే పనిలో పడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో
ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..
కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..
వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
