వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో
భారత రక్షణ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న 47 ఏళ్ల దేవేంద్ర బార్లెవార్ మూడోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. దాంతో ఆయన శరీరంలో ఇప్పుడు ఐదు మూత్రపిండాలు ఉన్నాయి. వాటిలో ఒకటే పనిచేస్తుంది. కిడ్నీలు చెడిపోతే ఒక్కసారి మాత్రమే డొనర్ దొరకడం పూనర్జన్మ అనుకుంటే.. ఈ బార్లెవార్‌కు ఏకంగా మూడు సార్లు డొనర్లు దొరికారు. మూడో సారి బ్రెయిన్ డెడ్‌గా మారిన ఓ రైతు కుటుంబం సమ్మతితో అతనికి కిడ్నీ లభించింది. వరుసగా మూడు సార్లు మ్యాచింగ్ డొనర్లు లభించడం , సర్జరీలో తలెత్తే కాంప్లికేషన్లను తట్టుకుని నిలబడటంతో బార్లెవార్ కేసు చాలా అరుదైన కేసయింది. ఇప్పటికే ఉన్న నాలుగు కిడ్నీలకు మధ్యలో స్థలాన్ని ఐదవ కిడ్నీ కోసం డాక్టర్లు వాడుకోవడం వంటివి జరిగాయి.
బార్లెవార్ 2010లో క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడ్డారు. అప్పుడు ఆమె తల్లి అతనికి కిడ్నీని దానం చేశారు. ఆ కిడ్నీ ఓ ఏడాది పాటు పనిచేసింది. ఆ తర్వాత మళ్లీ డయాలసిస్ అవసరం ఏర్పడింది. దీంతో 2012లో ఆయన రెండో సారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. రెండో సారి అతని బంధువుల్లో ఒకరు కిడ్నీ దానం చేశారు. 2022 వరకు అంటే ఓ పదేళ్ల పాటు ఆ కిడ్నీ బాగా పనిచేసింది. అయితే బార్లెవార్ కోవిడ్ బారిన పడటంతో కరోనా వైరస్ ఆయన కిడ్నీపై ప్రభావం చూపించింది. దీంతో మరోసారి ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు. ఓ రైతు బ్రెయిన్ డెడ్‌తో మరణించడంతో ఆయన కిడ్నీ బార్లెబార్‌కు సరిపోలడంతో ఫరీదాబాద్లో గల అమృత హాస్పిటల్ వైద్యులు మూడోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు సిద్ధం అయ్యారు. కానీ, ఈ సారి చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. బాడీ ఆ ఆర్గాన్‌ను తిరస్కరించడం, లేదా బ్లీడింగ్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. పైగా ఇప్పటికే ఆయన బాడీలో నాలుగు కిడ్నీలు ఉండటంతో ఐదో కిడ్నీని ఎక్కడ పెట్టాలనే సవాల్ కూడా వైద్యులకు ఎదురైంది.

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
