Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?

వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?

Samatha J

|

Updated on: Feb 25, 2025 | 2:31 PM

భూకంపం.. ఈ ప్రకృతి విపత్తును శాస్త్రవేత్తలు ఇప్పటికీ సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా భూకంపాలు సంభవించినప్పుడలా పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఇటీవల ఫిబ్రవరి 17న దేశరాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. తెల్లవారకముందే రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలు భూ ప్రకంపనలతో ఉలిక్కిపడ్డాయి. ఉదయం 5 గంటల 36 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీతోపాటు నోయిడా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో బిహార్‌, సిక్కిం రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడ్డాయి. సుమారు 5 సెకెన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.0గా నమోదైంది.

భూకంప కేంద్రం ఢిల్లీలోనే ఉందని గుర్తించారు. ధౌలాకాన్‌లోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2025కు సంబంధించి బాబా వంగా, నోస్ట్రాడమస్‌ చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్‌ గురించి తెలిపిన నోస్ట్రడామస్, బాబా వంగా.. భూకంపాలు, ప్రకృతి విపత్తులు 2025లో అనేకం సంభవిస్తాయని ముందే ఊహించారు. నోస్ట్రడామస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల గురించి తెలిపేవాడు. భూమి కంపించటం, నదులు ఉప్పొంగటం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలను ముందుగానే తెలియజేశాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని నోస్ట్రడామస్ ముందుగానే తెలిపాడు. ఈయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రడామస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి గురించి రాశాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని పేర్కొన్నాడు.2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రడామస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సూడాన్‌లో కరువు, పరిమిత సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి సంక్షోభం ఎదురవుతుందన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది.