Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఏఐ టెక్నాలజీ!ఇక టెక్‌ కంపెనీల చేతుల్లోకి యుద్ధతంత్రం?

ఇజ్రాయెల్‌ యుద్ధంలో ఏఐ టెక్నాలజీ!ఇక టెక్‌ కంపెనీల చేతుల్లోకి యుద్ధతంత్రం?

Samatha J

|

Updated on: Feb 25, 2025 | 2:44 PM

మనిషి సృష్టిలో అద్భుతం.. రోబో..!! అవును.. మనిషి తన అవసరాల కోసం.. తనలాంటి మర మనుషులను తయారు చేసుకున్నాడు. అయితే.. ఆ మరయంత్రాలే.. కొద్దిరోజుల్లో మనిషిని శాసించే స్థాయికి అభివృద్ధి చెందనున్నాయా? అంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం అవుననే సమాధానం ఇస్తోంది. ఇజ్రాయెల్‌, గాజా మధ్య జరిగిన యుద్దంలో అనేక మిలిటెంట్‌ గ్రూపుల నేతలను ఇజ్రాయెల్‌ అనూహ్యంగా మట్టుబెట్టింది. ఎక్కడెక్కడో సొరంగాల్లో దాక్కున్న నేతలను గుర్తించి వివిధ మార్గాల్లో హతమార్చింది. గాజా, లెబనాన్, ఇరాన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నేతల జాడను కనిపెట్టి మరీ అంతమొందించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారానే ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందన్న చర్చ మొదలయింది. ఇజ్రాయెల్‌కు ఏఐ సేవలను అమెరికా టెక్‌ కంపెనీలు అందించాయన్న సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇజ్రాయెల్‌ ట్రాక్‌ అండ్‌ కిల్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంలో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడింది. ఈ క్రమంలో అమాయకుల ప్రాణాలు కూడా పోవడం ఆందోళన కలిగించే విషయం. వాస్తవానికి ఏఐ టెక్నాలజీ అనేది జనన మరణాల కోసం తయారు చేసింది కాదు. సైన్యాలు యుద్ధంలో వినియోగించడానికి వీలుగా తమ అవసరాలకు అనుగుణంగా తయరు చేసిన టెక్నాలజీ. ప్రభుత్వాలు ఆయుధాల తయారీని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తుంటాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ఈసారి యుద్ధ క్షేత్రంలో అమెరికా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంది అనే అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రెండు దేశాల మధ్య జరిగిన యుద్దంలో ఏఐ టెక్నాలజీని వాడటం అనేది ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి అనైతిక, చట్ట వ్యతిరేక విధానాలు మరింత విస్తరిస్తే ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాస్‌ దాడి తర్వాత టెక్‌ కంపెనీల పాత్ర మరింత పెరిగింది. సొంత సర్వర్లు కెపాసిటీ దాటి పోవడంతో ప్రైవేట్‌ కంపెనీలపై సైన్యం ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా థర్డ్‌ పార్టీ జోక్యం పెరిగింది.
ఇజ్రాయెల్‌, గాజా మధ్య యుద్ధంలో ఏఐ టెక్నాలజీ