ఆమెను అంతరిక్షంలో వదిలివేయాలనుకున్నారు ??
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి రావడంపై అమెరికన్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ లు జో బైడెన్ తీరుపై సంచలన ఆరోపణలు చేశారు.
ఉద్దేశపూర్వకంగానే వారిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వదిలివేయాలని కోరుకున్నారని అన్నారు. ఈ ప్రకటన తర్వాత, అమెరికాలో రాజకీయ వివాదం మరింత రాజుకుంది. సునీతా విలియమ్స్ తోపాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ దాదాపు 10 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో NASA మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించారు. కానీ సాంకేతిక లోపాల కారణంగా వారు తిరుగు ప్రయాణం చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు వారు మార్చి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వారు తిరిగి రావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గత అధ్యక్షులు బైడెన్ తోపాటు అతని పాలనా యంత్రాంగం వ్యోమగామిలను అంతరిక్షంలోనే వదిలివేయాలనుకుందన్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం కారణంగా సునీత విలియమ్స్, బుచ్ గత ఏడాది జూన్ నుండి అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిద్దరూ స్టార్‌లైనర్‌లో 8 రోజుల మిషన్‌పై ISSకి వెళ్లారు. అయితే ఇటీవల ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సునీతా, బుచ్ ఇద్దరినీ గురించి ప్రశ్నించినప్పుడు, ట్రంప్ సమాధానం ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ రాజకీయ కారణాల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయారన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎన్నో లాభాలు
ఇంత వెధవల్లా ఉన్నారేంట్రా! కుంభమేళాలో మహిళల స్నానం
తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్నా.. సాయం మరవని ప్రభాస్
ఛావా సినిమా ఎఫెక్ట్ ! ట్రెండ్ అవుతున్న సింగర్ వైశాలి
ఉదిత్‌ను కోర్టుకు ఈడ్చిన మాజీ భార్య! ఆ సింగర్‌కు కష్టాలే కష్టాలు!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

