తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్నా.. సాయం మరవని ప్రభాస్
కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలా మనకు తెలియకుండానే ఎన్నో మంచి పనులు, సాయాలు చేసిన ప్రభాస్ మరో సారి అదే పని చేశాడు. తాను ఆ సమయంలో తీరని బాధలో ఉన్నా కూడా రచయిత తోట ప్రసాద్‌ని ఆదుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే నేరుగా చెప్పడంతో.. మరో సారి ప్రభాస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.
ఆపద్భాందవుడు అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రభాస్ బిల్లా సినిమాకు రైటర్ అయిన తోట ప్రసాద్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. తను అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉంటే.. అడగకుండానే సాయం చేశాడంటూ చెప్పి కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ చాలా గొప్ప మనసు కలవాడని చెప్పిన తోట ప్రసాద్.. ఆయన నటించిన బిల్లా సినిమాకి తాను రచయితగా చేశానన్నారు. జస్ట్ ఆ కొద్దిపాటి పరిచయంతోనే ప్రభాస్ తనకు ఎప్పటికీ మర్చిపోలేని సాయం చేశాడని తోట ప్రసాద్ చెప్పారు. తాను 2010లో ఓసారి ఆస్పత్రి పాలయ్యానని.. అయితే తాను హాస్పిటల్లో ఉన్న సంగతి తెలుసుకున్న ప్రభాస్ తన వైద్యానికి అవసరమయ్యే డబ్బు పంపించాడని చెప్పారు. తనకు సాయం చేసిన రోజే.. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ కన్ను మూశారని.. తన తండ్రి పోయిన బాధలో ఉన్నా కూడా.. ప్రభాస్ తనకు సాయం చేశాడంటూ చెప్పుకొచ్చారు తోట ప్రసాద్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛావా సినిమా ఎఫెక్ట్ ! ట్రెండ్ అవుతున్న సింగర్ వైశాలి
ఉదిత్‌ను కోర్టుకు ఈడ్చిన మాజీ భార్య! ఆ సింగర్‌కు కష్టాలే కష్టాలు!
హ్యాట్సాఫ్! తలకు గాయమైనా.. సినిమా ప్రమోషన్‌కు డుమ్మా కొట్టేదేలే
మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
