మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?
కర్ణాటకలోని చన్నగిరి తాలూకాలోని ధావణగేరే శిలామఠం లోకి ఒక రోబోటిక్ ఏనుగు వచ్చింది . ఫిబ్రవరి 24న శ్రీ మఠానికి చేరుకున్న ఏనుగుకు స్వామీజీ ఘన స్వాగతం పలికారు. ఆ రోబోటిక్ ఏనుగుకు ఉమామహేశ్వర్ అని పేరు పెట్టారు. గ్రామస్తులందరూ మేళ తాళాలతో రోబోటిక్ ఏనుగును ఊరేగించారు.
ఇక భక్తులు, స్థానికులు రోబోటిక్ ఏనుగు పక్కన నిలబడి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. ఈ ఏనుగును తయారు చేయించేందుకు భారీగానే ఖర్చు కూడా పెట్టారు. ముంబైకి చెందిన కుపా & పెటా ఇండియా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏనుగును మఠానికి అందించారు. ఈ ఫౌండేషన్ నుంచి ఇప్పటికే పలు ఆలయాలు, మఠాలకు రోబోటిక్ ఏనుగులు చేరాయి. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. ఒక రోబోటిక్ ఏనుగు ధర సుమారు 17 లక్షల రూపాయలని తెలుస్తోంది. ఏనుగును ట్రాలీపై ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు. అంటే కళ్లు మూసుకోవడం, చెవులు ఊపడం, తొండంతో భక్తులను ఆశీర్వదించడం.. ఇలా అన్ని రిమోట్ కంట్రోల్ ద్వారానే జరుగుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవి, సుకుమార్ పై అంబటి చీప్ కామెంట్స్! ఫ్యాన్స్ ఫైర్
TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్ కామెంట్స్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

