హ్యాట్సాఫ్! తలకు గాయమైనా.. సినిమా ప్రమోషన్‌కు డుమ్మా కొట్టేదేలే
సుమారు 20 ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది అన్షు. మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీలోనూ హీరోయిన్ గా నటించింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మరే మూవీలోనూ కనిపించలేదీ అందాల తార. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుని విదేశాల్లోనే సెటిల్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈమె మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సుమారు 20 ఏళ్ల తర్వాత ‘మజాకా’తో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో తలకు బ్యాండేజ్ తో కనిపించి అందర్నీ షాకయ్యేలా చేసింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మజాకా సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న హైదరాబాద్ లో మజాకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్లతో సహా చిత్ర బృందమంతా హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో నటి అన్షు తలకు బ్యాండేజ్‌తో కనిపించారు. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా.? అని అందరూ ఆరా తీస్తున్నారు. సెట్‌లో ఏమైనా గాయమయ్యిందా? లేక ఇంట్లోనే దెబ్బ తగిలిందా. అని చర్చించుకుంటున్నారు. అంతేకాదు గాయంతోనే అన్షు సినిమా ఈవెంట్ కు హాజరవ్వడంపై అభిమానులు ప్రశంసిస్తున్నారు. సినిమాపై అమెకున్న డెడికేషన్ అదుర్స్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చిన స్టార్ హీరో.. ధర ఎంతో తెలుసా?
చిరంజీవి, సుకుమార్ పై అంబటి చీప్ కామెంట్స్! ఫ్యాన్స్ ఫైర్
TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్ కామెంట్స్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

