చిరంజీవి, సుకుమార్ పై అంబటి చీప్ కామెంట్స్! ఫ్యాన్స్ ఫైర్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక మెగా ఈవెంట్లో ఈ రెండు టీమ్స్ తలపడుతున్నాయ్ అంటే కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. చాలా మంది స్టేడియానికి వెళ్లి లైవ్‌లో ఆ మ్యాచ్‌ను ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు.
సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రెటీలు కూడా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆసక్తి చూపిస్తారు. అలానే ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్ కూడా చాలా మంది సెలబ్రెటీలే వచ్చారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్, మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. స్టేడియంలో వారిని చూసి చాలా మంది తెలుగు వాళ్లు షాక్ అయ్యారు. కామెంట్రీ చేస్తున్న అంబటి రాయుడు కూడా షాకయ్యాడు. ఫ్లోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన కాంట్రో కామెంట్స్ కారణంగా.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. దాంతో పాటే ట్రోల్ అవుతున్నాడు. ఇంతకీ అంబటి రాయుడు అంతగా ఏం మాట్లాడాడు అంటే.. ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్ అందుకే సెలబ్రిటీలు వస్తుంటారంటూ.. కాంట్రో కామెంట్స్ చేశాడు అంబటి. అది కూడా సుకుమార్, చిరంజీవి గురించి తెలుగు కామెంటర్లు మాట్లాడుతున్న సమయంలో రాయుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో… ఇప్పుడు తెలుగువాళ్లు ఈ స్టార్ క్రికెటర్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు మన దేశం తరఫున ఓ టీమ్ ఆడుతున్నప్పుడు, ఆటపై ఇష్టంతో సపోర్ట్ చేయడానికి డబ్బు ఖర్చుపెట్టుకొని స్టేడియానికి వచ్చిన వారిని ఈ రకంగా అవమానిస్తావా అంటూ నెటిజన్లు రాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: స్టేడియంలో చిరంజీవి, సుకుమార్.అంబటి చీప్ కామెంట్స్

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
