Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

డెస్క్‌కు చీమిడి రుద్దిన ఎలాన్ మస్క్ కొడుకు.. అది చూసిన ట్రంప్ ఏం చేశాడంటే! వీడియో

Samatha J

|

Updated on: Feb 27, 2025 | 1:53 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు నీట్‌నెస్‌ అంటే మక్కువ. వ్యక్తిగతంగానే కాదు.. తన చుట్టూ ఉండే పరిసరాలను, పని చేసే ఆఫీసును కూడా ఎప్పుడూ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ఓ బుడ్డోడు ముక్కులో వేలు పెట్టుకుని ఏకంగా తాను పని చేసే డెస్క్‌కే రుద్దాడు. ఇంకేముంది ట్రంప్‌ ఊకుంటారా? క్షణాల్లోనే ఆ డెస్క్‌ను మార్చేశారు. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కొడుకే. నాలుగేళ్లు ఉంటాయి. చిన్నోడు మారాం చేస్తుండని ఈ మధ్యన ట్రంప్‌ మీటింగ్‌కు తీసుకెళ్లాడు.

ట్రంప్‌, మస్క్‌ సీరియస్‌ ముచ్చటల్లో ఉండగానే పిలగాడు ఉండెతాన ఉండక ముక్కులో చీమిడి తీసి ఏకంగా ట్రంప్‌ డెస్క్‌కే రుద్దాడు. దీంతో కొత్త అధ్యక్షుడికి చిర్రెత్తుకొచ్చినంత పనైంది. పక్కన పిలగాని డాడీ ఉన్నాడని ఆగినట్టున్నారు కానీ. లేదంటేనా.. అమెరికా అధ్యక్ష భవనానికి ఉండే గౌరవం అంతా ఇంతా కాదు.. అందులో ఉండే ప్రతీ వస్తువుకు ఎంతో విలువ ఉంటుంది. అంతకు మించి ఆ వస్తువులకు ఘన చరిత్ర ఉంటుంది. అలాంటి వస్తువే రెసోల్యూట్‌ డెస్క్‌. ఆ డెస్క్‌కు 145 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అమెరికా పూర్వపు అధ్యక్షులు ఉడ్రోవిల్సన్‌, ట్రుమన్‌, జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, రీగన్‌, క్లింటన్‌, ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌.. ఇలా ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ఆ డెస్క్‌ను ఉపయోగించారు. ఎన్నో ముఖ్యమైన ఫైళ్లకు సంతకాలు చేసిన డెస్క్‌ అది. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ ఇప్పటిదాకా ఆ డెస్క్‌నే ఉపయోగించారు. అలాంటి డెస్క్‌ మీద బుడ్డోడు ముక్కు చీది రుద్దడంతో పూర్తిగా డెస్క్‌నే మార్చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యక్తి శరీరంలో 5 కిడ్నీలు..ఢిల్లీ డాక్టర్ల అద్భుతం వీడియో

ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్​లోకి 7 గ్రహాలు.. ఎప్పుడు చూడొచ్చంటే..

కోడిని కోర్టుకు లాగిన వ్యక్తి.. నిద్ర చెడగొడుతోందని ఫిర్యాదు .. ఏమైందంటే..

వామ్మో.. 2025లో చాలా ఘోరాలు జరగబోతున్నాయా?