Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh 2025: రికార్డులే రికార్డులు.. కుంభమేళాకు చివరి రోజున ఎంత మంది వచ్చారో తెలుసా..?

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా మహాఘట్టం నేటితో (ఫిబ్రవరి 26) ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా.. మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది.. చివరి రోజున భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహాకుంభమేళాలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు..

Maha Kumbh 2025: రికార్డులే రికార్డులు.. కుంభమేళాకు చివరి రోజున ఎంత మంది వచ్చారో తెలుసా..?
Maha Kumbh 2025
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2025 | 6:54 PM

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా మహాఘట్టం నేటితో (ఫిబ్రవరి 26) ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా.. మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది.. చివరి రోజున భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహాకుంభమేళాలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఇప్పటివరకు 65 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.. చివరి రోజున గణాంకాలు చూసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..

కాగా.. ఏడు శైవ అఖారాలకు, మహాకుంభ్-2025 బుధవారం నాడు గొప్ప పేష్వై ఊరేగింపుల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహాశివరాత్రి నాడు ముగిసింది. పేష్వై ఊరేగింపులో భాగంగా, 10,000 మందికి పైగా నాగ సాధువులు, పండుగ ఉత్సాహాన్ని పెంచుతూ, కాశీ రోడ్ల గుండా తమ దేవతలు, జెండాలతో, త్రిశూలాలు, కత్తులు, గదలను ప్రదర్శిస్తూ ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాల మధ్య పాడుతూ, నృత్యం చేస్తూ ప్రదర్శన చేశారు.

శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటేత్తారు. చివరిరోజున కుంభమేళాలో భక్తులపై హెలికాఫ్టర్‌తో పూలవర్షం కురిపించారు.. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చే వారిలో మరింత భక్తిభావం పెంచేలా ఇలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కుంభమేళాలో భాగంగా మహా శివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

చివరిరోజు.. మహాశివరాత్రి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుండటంతో మరోసారి యూపీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ఆంక్షలను అమలు చేస్తూ… అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. కుంభమేళా ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికిల్ జోన్‌గా ప్రకటించి.. సిబ్బందిని భారీగా మోహరించారు. కాగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు సీనియర్ అధికారులతో మాట్లాడుతూ.. శివరాత్రి వేడుకలు సజావుగా జరిగేలా చూశారు.

కాగా.. శివరాత్రి రోజున 12 జ్యోతిర్లింగాలలో అత్యంత పూజనీయమైన కాశీ విశ్వనాథుని ఆలయానికి భక్తులు పోటేత్తారు.. లక్షలాది మంది తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి వేడుకల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు పాల్గొనడంతో గత రికార్డులన్నింటినీ బద్దలైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మార్చి 30న శ్రీ ఆదిశంకర మఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మనోజ్‌ బాజ్‌పాయ్‌ 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే.. పిందె కూడా వదిలిపెట్టరండోయ్..
పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే.. పిందె కూడా వదిలిపెట్టరండోయ్..
Team India: రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే..?
Team India: రోహిత్ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా ఎవరంటే..?
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల కంటే మనదేశంలో ఎక్కువ బంగారం
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
దారుణం.. సంతానం కోసం నరబలి.. కొడుకు పుట్టాలని వృద్ధుడి తలతో..
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
ఈ టాలీవుడ్ బ్యూటీని గుర్తు పట్టారా? ఈమె భర్త పవర్ ఫుల్ విలన్
యమునా నది పరిశుభ్రతకే ప్రాధాన్యతః సీఎం రేఖా
యమునా నది పరిశుభ్రతకే ప్రాధాన్యతః సీఎం రేఖా
Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది
Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేయండి ఇలా..!
ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ఉగాదిని సెలబ్రేట్ చేయండి ఇలా..!