AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbh Mela: కుంభమేళా ప్రాంతంలో ఫుల్‌స్వింగ్‌లో క్లీనింగ్‌ డ్రైవ్‌

మహా కుంభమేళాను అత్యద్భుతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం..కార్యక్రమం తర్వాత క్లీనింగ్‌ డ్రైవ్‌ను కూడా అదే స్థాయిలో చేపట్టింది. కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏర్పాట్లను తొలగించడంతో పాటు.. నదిలో భారీగా పొగుబడ్డ వ్యర్థాలను క్లీన్ చేస్తోంది. పర్యావరణానికి హానికలగని రీతిలో..ఈ కార్యక్రమం చేపట్టింది యోగి ప్రభుత్వం.

Kumbh Mela: కుంభమేళా ప్రాంతంలో ఫుల్‌స్వింగ్‌లో క్లీనింగ్‌ డ్రైవ్‌
Maha Kumbh Mela Cleaning
Ram Naramaneni
|

Updated on: Mar 08, 2025 | 8:27 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లోని నదీతీరంగా భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నాలను ముమ్మరంగా చేపట్టింది..యోగి సర్కారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన క్లీన్‌నెస్‌డ్రైవ్‌లో వేలమంది పారిశుద్ధ్య కార్మికులు, గంగా సేవా దూతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా సంగం ఘాట్లు, మేళా గ్రౌండ్ రోడ్లు, పర్మనెంట్, టెంపరరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లను శుభ్రం చేస్తున్నారు. అలాగే.. తాత్కాలిక పైప్ లైన్లు, స్ట్రీట్ లైట్లు, టెంట్లు, పెవిలియన్లను తొలగిస్తున్నారు. (Spot)

నదిలో 600 టన్నుల వ్యర్థాల సేకరణ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక జరిగిన త్రివేణి సంగమ ప్రాంతంలో..నదిలో తేలుతున్న 600 టన్నుల వ్యర్థాలను సేకరించారు..పారిశుద్ధ్య సిబ్బంది. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తోంది..ప్రభుత్వం. తద్వారా పర్యావరణానికి హాని కలగని విధంగా వాటిని నిర్మూలిస్తోంది. రెండున్నర కిలోమీటర్ల మేర జరుగుతున్న కుంభమేళా క్లీనింగ్‌ డ్రైవ్‌లో.. 83 భారీ డ్రెడ్జింగ్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఆరు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక, వ్యర్థాలను తొలగించారు. దాంతో ఇప్పటికే నదీ ప్రవాహం మెరుగుపడింది.

లక్షన్నర తాత్కాలిక మరుగుదొడ్ల తొలగింపు

కుంభమేళా ప్రాంతంలో వెయ్యి టెన్నిస్‌ కోర్టులకు సమానమైన ప్రాంతాన్ని ఇప్పటికే శుభ్రం చేశారు..పారిశుద్ధ్య సిబ్బంది. అలాగే మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన లక్షన్నర తాత్కాలిక మరుగుదొడ్లను కూడా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను క్రమపద్ధతిలో ప్రాసెస్ చేసి నైనిలోని బస్వర్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మరోవైపు కుంభమేళాలో 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించిన్‌ క్లీన్‌డ్రైవ్‌..ఇప్పటికే రికార్డు సృష్టించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..