AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రెండు దేశాలతో ఎప్పటికైనా భారతదేశానికి ముప్పే.. భారత ఆర్మీ చీఫ్ షాకింగ్‌ కామెంట్స్‌..!

చైనా, పాక్‌ సంబంధాలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆ రెండు దేశాలు ఏకమయ్యే భారత్‌పై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. చైనా, పాక్‌ నుంచి ఎప్పటికైనా దేశానికి ముప్పే అన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆ రెండు దేశాలతో ఎప్పటికైనా భారతదేశానికి ముప్పే.. భారత ఆర్మీ చీఫ్ షాకింగ్‌ కామెంట్స్‌..!
Chief Of Army Staff General Upendra Dwivedi
Balaraju Goud
|

Updated on: Mar 08, 2025 | 8:55 PM

Share

చైనా, పాకిస్థాన్‌ దేశాలను ఉద్దేశించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్ర పూరిత సంబంధాన్ని భారత్ అంగీకరించాల్సిందే అన్నారు. అంతేకాదు.. చైనాలో తయారు అవుతున్న అనేక మిలిటరీ ఉత్పత్తులను పాకిస్థాన్‌ వినియోగిస్తుందని.. వాటితోనే మన దేశంపై దాడికి ప్రయత్నిస్తుందని వివరించారు.

ఒక జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉపేంద్ర ద్వివేది చైనా, పాక్‌ కలిసి చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే మరింత అలెర్ట్‌గా ఉండాలన్నారు. ముఖ్యంగా.. వర్చువల్‌ డొమైన్‌లో చైనా, పాకిస్థాన్‌ మధ్య బంధం వందశాతం ఉందని వివరించారు. అందుకే.. ఈ రెండు దేశాల నుంచి భారత్‌కు ముప్పు ఉందని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. మరోవైపు.. భారత్‌-పాక్‌ బోర్డర్‌లోని పరిస్థితులపైనా అనుమానం వ్యక్తం చేశారు. వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ జమ్మూ కశ్మీర్‌లో చొరబాట్లు పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉందన్నారు. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదని.. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఉగ్రవాద కట్టడి కోసం స్ట్రాంగ్‌ యాక్షన్‌ తీసుకుంటుందని ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. 2018 నుంచి ఉగ్రవాద ఘటనల సంఖ్య 83 శాతం తగ్గాయన్నారు. కేవలం 45 మంది మాత్రమే ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. అటు.. ఆర్మీ చర్యలతో జమ్ముకశ్మీర్‌లో టూరిజం పెరిగిందన్నారు ఇండియన్‌ ఆర్మీ చీఫ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..