AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: ఖాకీ సినిమా సీన్‌ రిపీట్‌ చేస్తూ.. పోలీసులపై గుడుంబా బ్యాచ్‌ ఎటాక్‌! ఆ తర్వాత అసలు సినిమా చూపించిన పోలీసులు

బిహార్‌లోని పాలిగంజ్‌లో అక్రమ మద్యం వ్యాపారులు పోలీసులపై దాడి చేసి 11 మందిని గాయపరిచారు. హోలీ పండుగకు ముందు అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు పోలీసులు సోదాలు నిర్వహించగా, ఈ దాడి జరిగింది. దాడిలో రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. అనేక పోలీస్ స్టేషన్ల నుండి బలగాలు చేరుకుని, దాడి చేసిన వారిలో కొందరిని అరెస్టు చేశారు. గాయపడిన పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Bihar: ఖాకీ సినిమా సీన్‌ రిపీట్‌ చేస్తూ.. పోలీసులపై గుడుంబా బ్యాచ్‌ ఎటాక్‌! ఆ తర్వాత అసలు సినిమా చూపించిన పోలీసులు
Bihar
SN Pasha
|

Updated on: Mar 09, 2025 | 8:28 AM

Share

ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకెళ్తారని భయ పడతాం. ఇంటికి ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ వస్తే కూడా కంగారు పడిపోతాం. అలాంటిది ఓ ఊరికి పదుల సంఖ్యలో పోలీసులు రెండు జీపులు వేసుకొని వచ్చినా.. ఓ ఊరిలో కొందరు అస్సలు భయపడలేదు సరికదా.. పోలీసులనే తరిమి తరిమి కొట్టారు. తమిళ హీరో కార్తీ హీరోగా వచ్చిన ఖాకీ సినిమాలో పోలీసులను ఓ ఊరి ప్రజలంతా ఏకమై దాడి చేసినట్లు.. ఇక్కడ కూడా ఏకంగా 11 మంది పోలీసులను గాయపర్చారు గుడుంబా బ్యాచ్‌. షాక్‌కు గురిచేసే ఈ సంఘటన బిహార్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్‌లోని పాలిగంజ్‌లో అక్రమ మద్యం వ్యాపారుల దాడిలో 11 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హోలీ పండగకి ముందు రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీని ఆపడానికి ఈ పోలీసులు ఓ ఊరిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులపై అక్రమ మద్యం వ్యాపారులు తిరగబడి, రెండు పోలీసు వాహనాలను తగలబెట్టి, పోలీసులను గాయపర్చారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన తర్వాత, సమీపంలోని అనేక పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులు, డీఎస్‌పీ స్థాయి అధికారి హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొని పోలీసులపై దాడి చేసిన గుడుంబా బ్యాచ్‌ తాటతీశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రావడంతో అప్పటి వరకు ఎదురుతిరిగిన మద్యం మాఫియాలో కొంతమంది అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

ఈ సంఘటన గురించి రానిటల్ SHO ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, “హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవడానికి, అక్రమ మద్యం తయారీని ఆపడానికి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాఘోపూర్‌లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పుడు, అక్రమ మద్యం వ్యాపారులు పోలీసు బృందంపై దాడి చేశారు. రెండు వాహనాలను తగలబెట్టారు. 11 మంది పోలీసులను గాయపర్చారు. దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశాం” అని తెలిపారు. డీఎస్పీ ప్రీతమ్ సింగ్ మాట్లాడుతూ, “హోలీ పండుగ కోసం రాఘోపూర్ ముషారీలో అక్రమ మద్యం వ్యాపారంతో పాటు సారాయి తయారు చేస్తున్నట్లు రాణితాల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది, ఆ తర్వాత పోలీసు బృందం రాఘోపూర్ ముషారీకి చేరుకుని తనిఖీలు చేస్తుండగా అకస్మాత్తుగా, మద్యం మాఫియా రాళ్ల దాడి చేసింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత, సమీప పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు ముషారీలో దాడులు నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకోవడం వారిని అదుపుచేయగలిగాం” అని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..