Chicken Biryani: చికెన్ బిర్యానీ తిన్న పాపానికి రూ.8 లక్షల ఖర్చు.. 21 రోజులు నరకం.. ఇక జన్మలో తినరట..
ఓ బిర్యానీ.. 8 లక్షలు.. అంతా ఆగమాగం.. ఆసుపత్రి చుట్టూ ప్రదిక్షణలు.. అటు డబ్బులు లేక.. ఇటు చికిత్స స్పందిస్తుందో తెలియక ఓ కుటుంబం ఓ నెల రోజుల పాటు నరకం అనుభవించింది.. మహారాష్ట్రలోని ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం విందు గాధ దురదృష్టకర సంఘటనగా మారడంతోపాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా నిలిచింది.

ఓ బిర్యానీ.. 8 లక్షలు.. అంతా ఆగమాగం.. ఆసుపత్రి చుట్టూ ప్రదిక్షణలు.. అటు డబ్బులు లేక.. ఇటు చికిత్స స్పందిస్తుందో తెలియక ఓ కుటుంబం ఓ నెల రోజుల పాటు నరకం అనుభవించింది.. మహారాష్ట్రలోని ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం విందు గాధ దురదృష్టకర సంఘటనగా మారడంతోపాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా నిలిచింది. 34 ఏళ్ల షేక్ రూబీ అనే మహిళ ఫిబ్రవరి 3న తన కుటుంబసభ్యులతో స్థానిక రెస్టారెంట్ కు వెళ్లింది.. అక్కడ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది.. అయితే. ఆ బిర్యానీ.. తనను ఆసుపత్రికి చేర్చి నానా తిప్పలు పెడుతుందని అస్సలు ఊహించలేదు.. బిర్యానీ తిన్న వెంటనే భయానక అనుభవం ఎదురైంది. బిర్యానీలోని ఎముక గొంతులో ఇరుక్కోవడంతో నెల రోజుల పాటు నానా అవస్థలు పడింది.. అయితే.. ఆ చిన్న ఎముకను డాక్టర్లు 8 గంటల పాటు శ్రమించి శాస్త్రచికిత్స చేసి బయటకు తీశారు.. దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చు అయింది.. కోలుకునేందుకు 21 రోజులు పట్టిందని.. నరకం చూసినట్లు మహిళ ఆవేదన వ్యక్తంచేసింది.
వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన షేక్ రూబీ ఫిబ్రవరి 3న కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లి.. అందరితో కలిసి చికెన్ బిర్యానీ ఆరగించింది. అయితే, ఓ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోంది.. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.. పరీక్షించిన వైద్యులు రూబీకి సీటీ స్కాన్ చేయాలని చెప్పారు. అయితే, అదేమీ అక్కర్లేదంటూ రూబీ ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండు రోజులకు తీవ్రమైన జ్వరం, హైబీపీతో రూబీ ఆసుపత్రికి వచ్చింది. ఎక్స్ రే, సిటి స్కాన్ చేసిన వైద్యులకు గొంతులో ఇరుక్కుపోయిన ఎముక కనిపించగా.. వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.. అయితే.. ఆపరేషన్ రెండు గంటలు పడుతుందనుకుంటే.. అది కాస్త దాదాపు 8 గంటల పాటు జరిగింది.. చివరకు ఆపరేషన్ చేసి ఆ ఎముకను బయటకు తీశారు..
8 గంటలపాటు..
రూబీ అన్నవాహికను దెబ్బతీసిన 3.2 సెం.మీ. కోడి ఎముకను ఫిబ్రవరి 8న తొలగించారు. కానీ క్రిటికేర్ ఆసియా హాస్పిటల్‌లోని వైద్యులు గొంతు ప్రక్రియను ప్రారంభించినప్పుడు, అది దాని ప్రారంభ స్థానం (C4-C5 వెన్నుపూస డిస్క్‌లు) నుంచి అదృశ్యమైంది. ఎక్స్-రే – అల్ట్రాసౌండ్ పరీక్షలలో ఛాతీ లేదా ఉదరంలో అది కనిపించలేదు. రోగికి ఇంట్యూబేట్ చేయబడినప్పుడు చేసిన CT స్కాన్, గొంతు పైభాగమైన నాసోఫారెంక్స్‌కు ఊహించని విధంగా పైకి కదలికను చూపించింది.. ఆపరేషన్ రెండు గంటలకు బదులుగా ఎనిమిది గంటలు కొనసాగిందని వైద్యులు తెలిపారు. ముందు ప్రారంభ స్థానంలో ఉన్న ఎముక.. రోగి దగ్గడంతో పైకి ప్రయాణించిందని వైద్యులు పేర్కొంటున్నారు.. ఇదొక అరుదైన కేసుగా అభివర్ణించారు.
అయితే.. ఆపరేషన్ కు మొత్తం 8 లక్షల బిల్లు అయిందని రూబీ భర్త వివరించాడు.. స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు అందించిన విరాళాలతో ఈ మొత్తం పోగేసి ఆపరేషన్ చేయించినట్లు తెలిపాడు..
కాగా, ఈ ఆపరేషన్ తర్వాత 21 రోజుల పాటు గొంతులో అమర్చిన ప్రత్యేకమైన పైప్ ద్వారానే రూబీ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాతే కోలుకున్నానని.. ఇన్ని అవస్థలపాలు చేసిన బిర్యానీని ఇక జన్మలో తినబోను.. ఇంట్లో వండబోనని రూబీ వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
