AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalpana: నా ప్రైవేట్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు..! తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్‌ కల్పన!

టాలీవుడ్‌ ప్రముఖ గాయని కల్పన అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆసుపత్రిలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై అసత్య ప్రచారం జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు వ్యాపించాయి. ఈ అసత్య ప్రచారాలను అరికట్టాలని, తన వ్యక్తిగత వీడియోలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌ ఆమె ఫిర్యాదును సానుకూలంగా స్వీకరించింది.

Kalpana: నా ప్రైవేట్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు..! తెలంగాణ మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్‌ కల్పన!
Kalpana
SN Pasha
|

Updated on: Mar 09, 2025 | 7:21 AM

Share

అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి, అపస్మారక స్థితిలో ఆస్పత్రి పాలై వార్తల్లో నిలిచారు టాలీవుడ్‌ ప్రముఖ సింగర్ కల్పన. అయితే తాజాగా ఆమె తెలంగాన మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లను ఆపాలని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. నిజనిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని ఆమె మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను కోరారు. నిద్రమాత్రాలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అంతేకాకుండా తన ప్రైవేటు వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తూ తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. కల్పన ఫిర్యాదుపై మహిళా కమిషన్‌ సానుకూలంగా స్పందించింది.

అసత్య ప్రచారాలు చేసిన ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని ఆమెకు భరోసా కల్పించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు. కాగా ఇటీవలె కల్పన అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పోలీసుల సాయంతో వర్టెక్స్ ప్రీ వీలేజ్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్‌ ఆమెను ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం కోలుకుంటున్న కల్పన.. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టతనిచ్చారు. కేవలం నిద్ర మాత్రల మోతాదు ఎక్కువడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా తెలిపారు. ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని, అందుకే నిద్ర మాత్రలు వేసుకున్నానని వెల్లడించారు. కానీ, ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ప్రచారం చేశాయి. అలాగే పోలీసులు సైతం ఆరంభంలో ఆత్మహత్యాయత్నంగా భావిస్తూ.. కల్పన భర్తను కూడా విచారించారు.

దారిద్ర్యం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దారిద్ర్యం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు