AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranya Rao: న్యాయమూర్తి ముందే వెక్కి వెక్కి ఏడ్చిన రన్యారావు.. దుబాయ్‌కు వెళ్లడానికి ముందే

బెంగళూర్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యా రావు కేసు వివరాలను సీబీఐ సేకరించింది. మరోవైపు DRI కస్టడీలో ఉన్న రన్యారావు ఒంటిపై గాయాలు ఉండడం సంచలనం రేపింది. అయితే దుబాయ్‌కు వెళ్లకముందే తాను గాయపడినట్టు న్యాయమూర్తి ముందు రన్యా రావు తెలిపారు.

Ranya Rao: న్యాయమూర్తి ముందే వెక్కి వెక్కి ఏడ్చిన రన్యారావు.. దుబాయ్‌కు వెళ్లడానికి ముందే
Actress Ranya Rao
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2025 | 7:55 AM

Share

దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించిన బెంగళూర్‌ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన కేసు విచారణ వివరాలను DRI అధికారుల నుంచి సీబీఐ సేకరించింది. 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యా రావు వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్‌ సిండికేట్‌ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రన్యారావు ఒంటిపై తీవ్రగాయాలు ఉండడం సంచలనం రేపుతోంది. అయితే తనకు దుబాయ్‌కు వెళ్లడానికి ముందే గాయాలైనట్టు రన్యా రావు విచారణలో వెల్లడించారు. ఎందుకు గాయాలు అయిన విషయం మాత్రం వెల్లడించలేదు. అరెస్ట్‌ తరువాత తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు చెప్పారు. నిద్ర రావడం లేదని కూడా ఫిర్యాదు చేశారు. రన్యారావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 3 రోజుల కస్టడీలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఆమెను విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును రన్యా రావు అభ్యర్థించారు. అందుకు నిరాకరించిన కోర్టు నటి రన్యారావుకు వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించింది.

కోర్టులో హాజరుపర్చిన సమయంలో న్యాయమూర్తి ముందు రన్యారావు కంటతడి పెట్టినట్టు చెబుతున్నారు. దర్యాప్తునకు రన్యా రావు పూర్తిగా సహకరించడం లేదని డీఆర్​ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తరచుగా మానసికంగా బాధపడుతూ ఏడుస్తోందని తెలిపారు. వివరాలు వీలైనంత గోప్యంగా ఉంచాలని నటి అభ్యర్థించినట్లు వివరించారు. వీఐపీ ప్రోటోకాల్స్‌ను దుర్వినియోగం చేస్తూ బంగారం స్మగ్లింగ్‌ చేసే సిండికేట్‌లో రన్యారావు భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో సిండికేట్‌ హస్తం ఉండడంతో ర్టు రన్యారావు కస్టడీని మరో మూడురోజులు పొడిగించింది. నిందితురాలి కుటుంబ సభ్యులు కానీ, ఇతరులు కానీ ఆమెను కలవడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

దేశంలోని విమానాశ్రయాలకు విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చే ముఠాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవసరమైన సమాచారన్ని సేకరించడానికి ఇప్పటికే రెండు సీబీఐ బృందాలు బెంగళూరు, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్నాయి. ఈ వ్యవహారంలో డైరెక్టరేట్​ఆఫ్​రెవెన్యూ ఇంటెలిజెన్స్‏తో సీబీఐ కలిసి పనిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా