Tollywood: టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న బాలీవుడ్ బ్యూటీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీస్ రూపొందిస్తున్నారు. ఇటీవలే గతేడాది జవాన్ సినిమా సత్తా చాటగా.. ఇప్పుడు ఛావా మూవీ దూసుకుపోతుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సెలబ్రేటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. అటు సినిమాల్లోనూ మళ్లీ యాక్టివ్ అయ్యింది. తాజాగా మైథాలాజికల్, నేచురల్ థ్రిల్లర్ మూవీతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. బీటౌన్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. దబాంగ్ సినిమాతో హిందీలో మరింత పాపులర్ అయ్యింది.
ఇన్నాళ్లు హిందీలో పలు చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సోనాక్షి.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ జటాధర. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ.. ” ఈ మహిళా దినోత్సవం జటాధారలో బలం, శక్తి దీపస్తంభం ఉదయిస్తుంది. సోనాక్షి సిన్హాకు స్వాగతం” అంటూ నెట్టింట లుక్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఆమె ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అందులో నల్లటి కళ్లతో జుట్టు విరబూసుకొని భయపెట్టేలా ఉన్న సోనాక్షి లుక్ ఆకట్టుకుంటుంది. జటాధర సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రైన్ అంజలి, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు.
This Women’s day a beacon of strength and power rises in #Jatadhara! Welcome aboard #SonakshiSinha ❤️🔥@ZeeStudios_ #UmeshKrBansal #PrernaVArora @shivin7 #AnjaliRaina @girishjohar @kejriwalakshay @IamDivyaVijay @DeshmukhPragati @isudheerbabu @UrsVamsiShekar @VenkatKaly44863 pic.twitter.com/p9KR69XwAn
— Zee Studios South (@zeestudiossouth) March 8, 2025
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..








