Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. త్వరలోనే మహేష్ సైతం సెట్ లో అడుగుపెట్టనున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ మేనకోడలు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చాలా కాలంగా ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు పూర్తిగా రాజమౌళి సినిమా కోసమే టైమ్ కేటాయించారు. కొన్ని నెలలుగా ఈ మూవీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే అటు తన లుక్ సైతం మార్చేశారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించనున్నారు జక్కన్న. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ రానుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా మహేష్ మేనకోడులు ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మహేష్ బాబు అక్క మంజుల సైతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు ఆమె ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా మంజుల ఘట్టమనేని కూతురు..మహేష్ బాబు మేనకోడలు జాహ్నవి స్వరూప్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మాయి అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. సుధీర్ బాబు తనయుడు చరిత్ తో కలిసి జాహ్నవి ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోలో జాహ్నవి, చరిత్ ఇద్దరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అంతకు ముందు తల్లిదండ్లులతో కలిసి ట్రెడిషనల్ వేర్ లో జాహ్నవి కనిపిస్తున్న ఫోటోస్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి.
మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని అనేక చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో హీరో అక్కగా కనిపించింది. అలాగే నిర్మాతగానూ రాణిస్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పోకిరి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు మంజుల. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ విషయాలను పంచుకుంటారు.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన