Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
ఒకప్పుడు సినీరంగంలో మొదటి సినిమాతోనే ఫేమస్ అయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ స్టేటస్ అందుకోకుండా అనుహ్యంగా సినిమాలకు దూరంగా అయ్యారు. ఇప్పుడు ఆ తారలు ఏం చేస్తున్నారో తెలుసుకుందామా.

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ సినిమాలకు ఫ్యామిలీ అడియన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ హీరో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో చాలా బాగుంది ఒకటి. దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించారు. 2000లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కన్నడ హీరోయిన్ మాళవిక. ఇందులో భర్త స్నేహితుడి చేతిలో దాడికి గురైన మహిళగా.. ఆపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇద్దరు స్నేహితులను దూరం చేసే గృహిణి పాత్రలో నటించింది. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో మాళవికకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియనేస్తమా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు సినిమాలు చేసింది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే 2009 నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తెలుగులో చివరిసారిగా అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మూవీలో కనిపించింది. 2007లో సురేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తుంది. ఆమె భర్త ముంబైలో ఆర్కిటెక్టర్ ఇంటీరియర్ డిజైనర్.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న మాళవిక నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..