AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: వార్నీ.. కార్ల కలెక్షన్‌ చూస్తేనే దిమ్మతిరిగిపోతోందిగా.. ఇక అజిత్ ఆస్తులు తెలిస్తే షాకే..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఇటీవలే కేంద్రం పద్మ భుషణ్ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ హీరో పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అలాగే కొన్ని రోజుల క్రితం దుబాయ్ 24 హెచ్ కార్ రేసింగ్ లో తన టీంతో పాల్గొన్న అజిత్ విజయం సాధించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు అజిత్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Ajith Kumar: వార్నీ.. కార్ల కలెక్షన్‌ చూస్తేనే దిమ్మతిరిగిపోతోందిగా.. ఇక అజిత్ ఆస్తులు తెలిస్తే షాకే..
Ajith
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2025 | 5:31 PM

Share

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ హీరోకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం అజిత్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అజిత్ తన నటనతో, తన జీవితంలో ఎప్పుడూ భిన్నంగా ఉంటాడు. అజిత్‌కు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత, అతని ఆస్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న అజిత్ ఆస్తులు సైతం ఎక్కువగానే ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం అజిత్ వాడుతున్న కార్లలో ఎక్కువ భాగం ప్రీమియం కార్లు. అతను అన్ని రకాల వాహనాలను కలిగి ఉన్నాడు. జనవరి 2025 లో వచ్చిన నివేదికల ప్రకారం, అజిత్ కుమార్ నికర విలువ దాదాపు 350 కోట్లు.

రూ. 350 కోట్లు అజిత్ వాహనాల కొనుగోలుకు వెచ్చించిన మొత్తంలో కూడా చేర్చినట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు ఎంత వరకు కచ్చితమైనవో స్పష్టంగా తెలియడం లేదు. అజిత్ ఎప్పుడూ తన కార్ల కలెక్షన్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తాడు. అత్యుత్తమ స్పోర్ట్స్ కారు ఫెరారీ SF90, స్పీడ్ పరంగా ఇతర కార్ల కంటే ముందున్న Porsche GT3 RS, ఖరీదైన కారు లాంబోర్గినీ, అజిత్‌కి BMW, Audi, Mercedes వంటి కార్లు కూడా ఉన్నాయి. కార్లు మాత్రమే కాకుండా ప్రైవేట్ జెట్‌లను కూడా కలిగి ఉన్న నటుల జాబితాలో అజిత్ కూడా ఉన్నారు.

పద్మభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత, అజిత్ సోషల్ మీడియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు. అజిత్ కుమార్ తన కొత్త చిత్రం విధముయిర్చి విడుదలతో బిజీగా ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి మొదట్లో థియేటర్లలోకి రానుంది. రెండేళ్ల తర్వాత అజిత్‌కి ఇదే మొదటి సినిమా.

Source : 

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..