Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అతడి పేరు మారుమోగుతుంది. ఒక్క సినిమాతోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న అతడు ఇప్పుడు దక్షిణాదిని ఏలేస్తున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్.

అతడి తండ్రి ఒకప్పుడు స్టార్ హీరో. అలాగే తన అన్నయ్య సైతం స్టార్ స్టేటస్ ఉన్న హీరో. కానీ తన ఫ్యామిలీలో తోబుట్టువులకు వచ్చిన క్రేజ్ మాత్రం అతడికి రాలేదు. హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత ఫేడవుట్ అయిపోయాడు. ఫలితంగా ఇండస్ట్రీలో అతడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ఆ హీరో.. ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ 55 ఏళ్ల వయసులో అతడి కెరీర్ మలుపు తిప్పింది ఒక సినిమా. అందులో కనిపించింది కేవలం 15 నిమిషాలు అయినప్పటికీ స్టార్ హీరో రేంజ్ పాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్.
27 జనవరి 1969న ముంబైలో జన్మించాడు. బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర చిన్న కొడుకు. 1977లో తన తండ్రి చిత్రం ‘ధరమ్ వీర్’తో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అతను 1995లో ‘బర్సాత్’ చిత్రంతో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేసాడు. ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ ‘బెస్ట్ డెబ్యూ’ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. కానీ ఆ తర్వాత అతడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో కొన్నాళ్లపాటు వెండితెరపై కనిపించలేదు. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది.
ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల అతని పాత్ర ఐకానిక్‌గా మారింది. సినిమాలో నటుడికి 15 నిమిషాల స్క్రీన్ స్పేస్ వచ్చింది. ఇందుకోసం నటుడు రూ.4 కోట్లు వసూలు చేశాడు. యానిమల్ సినిమా తర్వాత బాబీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అటు వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు. ఇటీవలే కంగువ చిత్రంలోనూ కనిపించారు. నివేదికల ప్రకారం బాబీ డియోల్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఓటీటీ ప్రాజెక్టుల నుంచి సంపాదిస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ముంబైలోని జుహులో విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. బాబీ 1996లో తాన్యా అహుజాను వివాహం చేసుకున్నాడు. తాన్య విజయవంతమైన వ్యాపారవేత్త. అలాగే ఇంటీరియరి డిజైనింగ్ చేసింది. వీరికి ఇద్దరు కుమారులు.
View this post on Instagram
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..