Sakhi Movie: ఏంటీ.. సఖి సినిమాను ఆ ఇద్దరితో చేయాలనుకున్నారా..? ఎలా మిస్సయ్యిందంటే..
అందమైన ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ మణిరత్నం. ఎన్నో బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ వెండితెరపై ఆవిష్కరించారు. మణిరత్నం ప్రతి సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలు గడిచినా వీరిద్దరి కాంబోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మణిరత్నం రూపొందించిన అందమైన చిత్రాలలో సఖి ఒకటి.

డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ప్రేమకథా చిత్రాల్లో సఖి ఒకటి. అప్పట్లో ఈ సినిమా సన్సేషనల్ హిట్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయగా.. భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఆర్ మాధవన్, శాలిని జంటగా నటించగా.. జయసుధ కీలకపాత్ర పోషించింది. తమిళంలో అలై పాయుతే పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్. థియేటర్లలో వంద రోజులకు పైగా ప్రదర్శించబడిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇదే చిత్రాన్ని హిందీలో సాతియా పేరుతో రీమేక్ చేయగా.. అక్కడ సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో మాధవన్, శాలిని జోడికి అడియన్స్ ఫిదా అయ్యారు.
ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సఖి సినిమా కోసం మొదట బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ అనుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే మణిరత్నం మాట్లాడుతూ.. “నేను ముందుగా షారుఖ్, కాజోల్ తో ఈ సినిమా తీయాలనుకున్నాను. షారుఖ్ దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. కానీ అప్పటికీ క్లైమాక్స్ సరిగ్గా కుదర్లేదు. అందుకని ఆ సినిమాను పక్కనపెట్టేసి షారుఖ్ తో దిల్ సే సినిమా చేశాను. ఆ సినిమా పూర్తయ్యే సమయానికి సఖి క్లైమాక్స్ ను ఎలా రూపొందించాలని ఆలోచన తట్టింది” అంటూ చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ మణిరత్నం ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. చివరగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను రూపొందించారు. ఇందులో ఐశ్వర్య రాయ్, విక్రమ్ చియాన్, జయం రవి, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




