Tollywood: ఊపిరి బిగపట్టి చూడాల్సిందే బిగులు.. బ్లాక్ మ్యాజిక్‌తో ప్రతీకారం.. వణుకు పుట్టాల్సిందే
హారర్ మూవీస్ ఎంత భయానకంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. అయినప్పటికీ క్షణ క్షణం వెన్నులో వణుకు పుట్టించే సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో మేకర్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ మూవీస్ తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో ఈ సినిమా ఒకటి. దాదాపు గంటపాటు ఊపిరి బిగపట్టి ఈ సినిమా చూడాల్సిందే.
![Tollywood: ఊపిరి బిగపట్టి చూడాల్సిందే బిగులు.. బ్లాక్ మ్యాజిక్‌తో ప్రతీకారం.. వణుకు పుట్టాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/siccin-movie.jpg?w=1280)
సాధారణంగా హారర్ మూవీస్ చూడాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఓవైపు భయంతో వణికిపోతున్నప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈరోజుల్లో ఓటీటీల్లో ఇలాంటి తరహా కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ మూవీస్ క్రేజ్ గురించి తెలిసిందే. కానీ ఒక సినిమా చూస్తుంటే వణుకు పుడుతుంది. అలాంటి మూవీ గురించి తెలుసుకుందాం. కేవలం ఐదు రోజుల్లోనే కుటుంబం మొత్తం నాశనమై.. అనుక్షణం భయపెట్టించే ట్విస్టులతో కూడిన సినిమా. గుండె ధైర్యం ఉంటేనే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా దాదాపు 11 ఏళ్ల క్రితం విడుదలైంది. ఈ మూవీ ప్రధాన అంశం ఒక్కటే బ్లాక్ మ్యాజిక్ చేయడం. ఇందులోని థ్రిల్ సినిమా మొత్తం కనిపిస్తుంది. అలాగే ప్రమాదకరమైన సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
అదే 2014లో విడుదలైన టర్కీ హారర్ చిత్రం. దాని పేరు ‘సిసిన్’. ప్రతి “సిక్సిన్” సినిమా ఎపిసోడ్‌కి భిన్నమైన కథ ఉంటుంది, కానీ ప్రధాన అంశం ఒకటే. పగ, రహస్యాలు, మంత్ర విద్య. కుటుంబం, ద్వేషం, శాపాలు, దుష్టశక్తుల ప్రభావం కారణంగా జరిగ భయంకరమైన సంఘటనలను ఈ సినిమాలో చూడొచ్చు. ప్రతీకారం కోసం చేసే మాయల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రతి సీక్వెల్ కొత్త పాత్రల జీవితాల్లోని భయానక, మంత్రవిద్య థ్రిల్‌లను చూపిస్తుంది. సిక్సిన్ సిరీస్ దర్శకుడు ఆల్పర్ మెస్తీ, సిక్సిన్ మూవీ సిరీస్ ఇప్పటివరకు 6-7 ఎపిసోడ్‌లను విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మీరు సైతం హారర్ మూవీ లవర్స్ అయితే ఈ చిత్రాన్ని వెంటనే చూసేయ్యండి.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..