Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 OTT: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన పుష్ప 2 .. కొత్త సీన్లతో కలిపి స్ట్రీమింగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. 1890 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తద్వారా దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

Pushpa 2 OTT: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన పుష్ప 2 .. కొత్త సీన్లతో కలిపి స్ట్రీమింగ్
Pushpa 2 Reloaded Version
Follow us
Basha Shek

|

Updated on: Jan 30, 2025 | 11:50 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం గతేడాది డిసెంబర్ 05న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. సినిమా విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ చాలా చోట్ల మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజైన తర్వాత ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గత కొన్ని వారాల నుంచి ‘పుష్ప 2′ చిత్రం ఓటీటీ విడుదల గురించి పలు రూమర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. వాస్తవానికి పుష్ప 2 మూవీ మాత్రమే జనవరి 30 నుంచి ఓటీటీలోకి వస్తుందని ప్రచారం సాగింది. రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ కావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. అయితే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ 23 నిమిషాల కలిపిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ గురువారం (జనవరి 30) అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

పుష్ప 2’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సుమారు 200 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఇంతకు ముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కూడా నెట్ ఫ్లిక్స్ ఇంతే మొత్తం చెల్లించినట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత, ‘RRR’ కు గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీకి మంచి పేరొచ్చింది. వీరితో పాటు ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి స్టార్ నటీనటులు ఈ చిత్రంలో మెరిశారు భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.