Kalki 2898 AD Part 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కల్కి 2పై క్రేజీ అప్డేట్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' 2024లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు 'కల్కి 2898 AD' సినిమా సెకండ్ పార్ట్ షూట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ 2024లో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ మూవీలో స్టార్ కాస్ట్ ఉంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ సహా పలువురు స్టార్ నటీనటులు అతిథి పాత్రల్లో నటించారు. 2024లో ‘కల్కి 2898 AD’ సినిమా మొదటి భాగం మాత్రమే విడుదలైంది. రెండవ భాగం ఎప్పుడు విడుదల అవుతుందనేది తెలియలేదు. ఇప్పుడు దీనిపై చిత్ర నిర్మాత మాట్లాడారు. ‘కల్కి 2898 AD’ సినిమా క్లైమాక్స్‌లో ప్రభాస్‌ని కర్ణుడి అవతారంగా చూపించి సినిమా ముగించారు. అలాగే విలన్ యాస్కిన్ సంజీవినిని తాగి మళ్లీ యవ్వనంగా మారినట్లు చూపించారు. దీని తదుపరి కథను సినిమా రెండో భాగంలో చూపించాల్సి ఉంది. రెండవ భాగంలో యాస్కిన్, భైరవ ల మధ్య పోరు ప్రధానంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ గురించి నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కల్కి’ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఆయన ప్రకటించారు.
‘మే, ఏప్రిల్‌లో సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్‌లో భాగంగా రెండో భాగానికి అవసరమైన 25-30 శాతం సన్నివేశాలను చిత్రీకరించాం. కాబట్టి త్వరలో రెండో భాగం షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. 2025 ఆఖరిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం’ అని అశ్వినీదత్ తెలిపారు.
ఇటీవల జపాన్ లో రిలీజైన కల్కి సినిమా..
#カルキ2898AD を観ました
神話の世界より6000年後2898年の未来。地球は荒廃し、空に浮かぶ巨大要塞“コンプレックス”が地球を支配し…そして6000年前の宿命が動き出す🤩少しCGに振り回されてる感はあるけど、とても壮大な話に惹きつけられる。ただ、続編多くて、どれがどれだか分からなくなりそう😁 pic.twitter.com/Cqb8qsWzyt
— ぼっちぼっちでぼっち (@vGCl8rsv1MhZaB2) January 26, 2025
‘కల్కి 2898 AD’ సినిమా షూటింగ్ రెండేళ్లకు పైగా పట్టింది. అయితే రెండో పార్ట్ షూటింగ్ త్వరలోనే పూర్తవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘రాజా సాబ్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నాడు. ఆ తర్వాత ‘సలార్ 2’, ‘కల్కి 2’ సినిమాలను కలిపి ఒకేసారి స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్..
Spotted Bhairava? He’s chilling at Khaitalapur Flyover. Tag us when you see him! 🔥
Kalki Watch & Win: 🔗https://t.co/sURDvRNee8
World Television Premiere #Kalki2898AD Tomorrow 5:30Pm, Only on #ZeeTelugu#SpotBhairavaInHyderabad #Kalki2898ADWatchandWinContest… pic.twitter.com/WLSsqDqr34
— ZEE TELUGU (@ZeeTVTelugu) January 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








