Pushpa 2 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పుష్ప2: ది రూల్’ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రప్పా రప్పా అంటూ థియేటర్లలో రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోసందడి చేయనుంది. అది కూడా రీలోడెడ్ వెర్షన్ తో ..

గతేడాది డిసెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటివరకు రూ. 1890 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తద్వారా దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికే ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తోంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలామంది వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెర పడనుంది. మరో మూడు రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది. పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదల అయిన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే ‘పుష్ప2: ది రూల్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్‌ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది.
జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాప్‌లో చూపిస్తోంది. కాగా డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను కూడా ఇదే రన్ టైమ్ తో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నూ పుష్ప 2 స్ట్రీమింగ్ కానుంది.
జనవరి 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
#Pushpa2TheRule is now Indian Cinema’s INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥
The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2
Book your tickets now! 🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE
— Pushpa (@PushpaMovie) January 6, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.