AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ వారం థియేటర్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. మరీ ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయంటే..

జనవరి చివరి వారంలో థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అలాగే అటు ఓటీటీల్లోనూ కొన్ని వెబ్ సిరీస్.. సూపర్ హిట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. మరీ ఈ వారం ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు రాబోతున్నాయో తెలుసుకుందామా.

Tollywood: ఈ వారం థియేటర్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. మరీ ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయంటే..
Upcoming Movies
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2025 | 3:21 PM

Share

సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లు రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. జనవరి చివరి వారంలోనూ అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న చిత్రాలు, డబ్బింగ్ మూవీస్ అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. మరీ ఈ వారం థియేటర్, ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా.

మదగజ రాజు.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన సినిమా మదగజ రాజు. డైరెక్టర్ సి.సుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తమిళంలో సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 12 తర్వాత విడుదలైన ఈ సినిమాకు తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 31న సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో విడుదల చేయనున్నారు.

రాచరికం.. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాచరికం. డైరెక్టర్ సురేష్ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 31న అడియన్స్ ముందుకు రానుంది.

మహిష.. కె.వి.ప్రవీణ్, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మహిష. కె.వి ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది.

ఓటీటీలో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు..

ఐడెంటిటీ..

మలయాళీ హీరో టొవినో థామస్, త్రిష జంటగా నటించిన సినిమా ఐడెంటిటీ. ఈ చిత్రాన్ని అఖిల్ పాల్, అనాస్ ఖాన్ సంయుక్తంగా రూపొందించారు. జనవరి 24నతెలుగులో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో జనవరి 31 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్..

ర్యాంపేజ్.. హాలీవుడ్.. జనవరి 26 ట్రైబ్యునల్ జస్టిస్ 2.. వెబ్ సిరీస్.. జనవరి 27 బీచ్.. హలీవుడ్.. జనవరి 30 ఫ్రైడే నైట్ లైట్స్.. హలీవుడ్.. జనవరి 30

జియో సినిమా..

ది స్టోరీ టెల్లర్.. హిందీ.. జనవరి 28

ఆపిల్ టీవీ ప్లస్..

మిథిక్ క్వెస్ట్.. వెబ్ సిరీస్.. జనవరి 29

సోనీలివ్..

సాలే ఆషిక్.. హిందీ.. ఫిబ్రవరి 1

నెట్ ఫ్లిక్స్..

లుక్కాస్ వరల్డ్.. హాలీవుడ్.. జనవరి 31 ది స్నో గర్ల్ 2.. వెబ్ సిరీస్.. జనవరి 31

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..