హీరోయిన్స్ విషయంలో వెంకీ మ్యాజిక్.. అప్పడు అంజలి.. ఇప్పుడు ఐశ్వర్యా రాజేష్!
వెంకీ గ్యారేజ్.. ఇచ్చట తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇవ్వబడును..! ఏంటిది అనుకుంటున్నారా..? చూడ్డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే జరుగుతుందిప్పుడు ఇండస్ట్రీలో. ఎప్పట్నుంచో పక్క ఇండస్ట్రీలో ఉండి బ్రేక్ కోసం చూస్తున్న తెలుగమ్మాయిలకు వెంకటేష్ బ్రేక్ ఇస్తున్నారు. పుష్కరం కింద జరిగిన సీనే మళ్లీ రిపీట్ అయిందిప్పుడు. మరి ఈ మ్యాజిక్ ఏంటో చూద్దామా..?
Updated on: Jan 27, 2025 | 2:24 PM

బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం వెంకటేష్ దండయాత్ర తప్ప ఇంకేం కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఫ్యామిలీస్ అందరినీ థియేటర్స్‌కు రప్పిస్తున్నారు వెంకీ, అనిల్ రావిపూడి. ఇక హీరోయిన్ల విషయంలోనూ వెంకీ మ్యాజిక్ బాగానే పని చేస్తుంది. ముఖ్యంగా తెలుగమ్మాయిలకు కావాల్సిన బ్రేక్ ఇస్తున్నారు ఈ సీనియర్ హీరో.

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నా.. తెలుగులో సరైన గుర్తింపు లేని ఐశ్వర్య రాజేష్‌కు సంక్రాంతికి వస్తున్నాంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చారు వెంకటేష్. ఈ ఒక్క సినిమాతో అమ్మడి పేరు టాలీవుడ్‌లో మార్మోగుతుంది. కాస్త లేటుగా టాలీవుడ్‌కు వచ్చినా.. సంక్రాంతికి వస్తున్నాంతో ఎంట్రీ మాత్రం గట్టిగానే ఇచ్చారు ఐశ్వర్య రాజేష్.

సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యం పాత్రలో రప్ఫాడించారు ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు ఐశ్వర్య విషయంలో జరిగిన మ్యాజిక్కే.. పుష్కరం కింద అంజలి విషయంలో జరిగింది. అప్పటి వరకు తమిళంలో బిజీగా ఉన్న అంజలికి.. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో బ్రేక్ వచ్చింది. 2013 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రంలోనూ వెంకటేష్ హీరోగా నటించారు.

సీతమ్మ వాకిట్లో..లో వెంకీకి జోడీగా సీత పాత్రలో అద్భుతంగా నటించారు అంజలి. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగులో వరసగా సినిమాలు చేసారు.. ఇప్పటికీ చేస్తున్నారు కూడా.

మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్‌లోనూ రామ్ చరణ్ భార్యగా నటించారు అంజలి. మొత్తానికి తెలుగమ్మాయిలకు బ్రేక్ ఇస్తున్నారు వెంకటేష్.. అది కూడా సంక్రాంతి సినిమాలతోనే కావడం విశేషం.





























