బాలీవుడ్ హీరోయిన్స్‌కు షాకిస్తున్న టాలీవుడ్ బ్యూటీస్! ఎలా అంటే?
నార్త్ అయినా.. సౌత్ అయినా.. మేం దిగనంతవరకే..! వన్స్ వి స్టెప్ ఇన్.. హిస్టరీ అవర్స్ అంటున్నారు మన హీరోయిన్లు. బాలీవుడ్‌కు వెళ్లడం కాదు.. అక్కడి హీరోయిన్లకు పని లేకుండా చేస్తున్నారు దక్షిణాది హీరోయిన్లు. హిందీ అప్‌కమింగ్ సినిమాలన్నింటిలోనూ సౌత్ బ్యూటీసే కనిపిస్తున్నారు. హీరోలే కాదు.. హీరోయిన్లు డామినేట్ చేస్తున్నారక్కడ.
Updated on: Jan 27, 2025 | 2:25 PM

మనదే ఇదంతా..! బాలీవుడ్‌ను చూసి మన హీరోయిన్లు చెప్తున్న మాట ఇదే. ఏదో చుట్టపు చూపుగా ఇలా వెళ్లి అలా వచ్చేయడం కాదు.. అక్కడే జెండా పాతేయాలని చూస్తున్నారు సౌత్ హీరోయిన్లు.

ఈ క్రమంలోనే రష్మిక మందన ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం సికిందర్, తమ, చావా లాంటి సినిమాలతో బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్.

సాయి పల్లవి సైతం మెల్లగా బాలీవుడ్‌లో తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటున్నారు. సౌత్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. హిందీలోనూ రామాయణ్‌లో సీతగా నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఇందులో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకుడు.

2026 దివాళికి రామాయణ్ పార్ట్ 1, 2027 దివాళికి పార్ట్ 2 విడుదల కానున్నాయి. బేబీ జాన్ తర్వాత కీర్తి సురేష్ పేరు కూడా బాలీవుడ్‌లో బాగానే వినిపిస్తుంది.

ఇక సమంత ఆల్రెడీ కేరాఫ్ బాలీవుడ్ అయిపోయారు. రక్త్ బ్రహ్మండ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారీమే. తమన్నా కూడా ఎక్కువగా హిందీలోనే కనిపిస్తున్నారు. మొత్తానికి నార్త్‌లో సౌత్ బ్యూటీస్ హవా బాగానే ఉందిప్పుడు.





























