Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్‌.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!

Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్‌.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!

Phani CH

|

Updated on: Jan 28, 2025 | 3:38 PM

గతేడాది డిసెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పటివరకు రూ. 1890 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా రికార్డుల కెక్కింది.

ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పటికీ పుష్ప 2 థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.,. పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు రెండు నెలలు కావస్తోంది. దీంతో ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని చాలామంది వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. మరో మూడు రోజుల్లో అల్లు అర్జున్ సినిమా ఓటీటీలోకి రానుంది. పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదల అయిన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతుందని ఇదివరకే ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే ‘పుష్ప2: ది రూల్‌’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ రీలోడెడ్‌ వెర్షన్‌ను డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో పుష్ప 2 స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు పుష్ప 2 రీలోడెడ్‌ వెర్షన్‌ గురువారం రిలీజ్‌ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాప్‌లో చూపిస్తోంది. డిసెంబరు 5న 3 గంటలా 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలకు పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను కూడా ఇదే రన్ టైమ్ తో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నూ పుష్ప 2 స్ట్రీమింగ్‌ కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Durgha Tej: అభిమానుల కడుపు నింపిన తేజు.. ఏకంగా మామను మించేలా ఉన్నాడుగా

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్‌

అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా

7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??

Published on: Jan 28, 2025 12:59 PM