Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ‘దేనికైనా రెడీనా? అని అడిగాడు’.. క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన మరో స్టార్ హీరోయిన్

కాస్టింగ్ కౌచ్.. గత కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు పట్టిన శాపం. ఎంతో మంది నటీమణులు లైంగిక వేధింపుల బారిన పడ్డారు. అయితే గత కొన్నేళ్లుగా నటీమణులు దీని గురించి బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. 'మీ టూ' ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలోని పలు చీకటి వ్యవహారాలు బట్టబయలయ్యాయి.

Actress: 'దేనికైనా రెడీనా? అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన మరో స్టార్ హీరోయిన్
Bollywood Actress
Basha Shek
|

Updated on: Jan 28, 2025 | 1:51 PM

Share

క్యాస్టింగ్ కౌచ్ పై మరో హీరోయిన్ గళం విప్పింది. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఒక డైరెక్టర్ తనను కమిట్మెంట్ అడిగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దంగల్’లో అమిర్ కూతురి పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో తన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది ‘దంగల్’ చిత్రంలో నటించి ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది నటి ఫాతిమా సనా షేక్. అయితే చాలామందికి తెలియని ఈ విషయం ఏమిటంటే ఈ అందాల తార ఒక తెలుగు సినిమాలోనూ నటించింది. ‘ సౌత్ ఇండియన్ సినిమాల్లో నటిస్తే బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తాయి. అదే కారణంతో కొన్ని సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. కానీ అక్కడ నాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో సినిమా ఆడిషన్ ఉంటుందని, ప్రొఫైల్ పంపమని నా స్నేహితుడు చెప్పాడు. అలాగని నా ఫోటోలు పంపితే.. నాకు ఫోన్ చేసిన వ్యక్తి ‘ఈ పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా?’ అని అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ, అర్థం కానట్టు, ‘ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. పాత్రకు కావాల్సినంత పని చేస్తాను’ అని అన్నాను. కానీ అతను పదేపదే అడుగుతూనే ఉన్నాడు ‘ఏదైనా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా’? నేను కూడా అతని ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేని విధంగా సమాధానమిస్తున్నాను. కానీ చివరికి అతను చిరాకుపడి ఫోన్ కట్ చేసాడు’ అని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

హైదరాబాద్‌లో ఓ నిర్మాతను కలిసిన స‌మ‌యంలో ‘ ఇక్కడ నిర్మాతలు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడుతారు. మీకు తెలుసా.. ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్లు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్లుకాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశమైతే అదే అని తెలిసిపోయేది’ అని ఫాతిమా తెలిపింది. దీంతో ప్ర‌స్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట‌ వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఫాతిమా సనా షేక్ ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో నటించింది. ఆ సినిమా పేరు ‘నువ్వు నేను ఒక్కటౌదాం’ అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఫాతిమా తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు. ఫాతిమా ప్రస్తుతం మూడు హిందీ సినిమాల్లో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.