AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఊహించని ట్విస్టులు.. ఒక్కో సీన్ మైండ్ బ్లాంకే.. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూస్తే..

ఈ మధ్య కాలంలో హరర్ మూవీస్, థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కొన్నాళ్లు థియేటర్లు, ఓటీటీలలో మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా భాషతో సంబంధం లేకుండా హారర్ మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్న ఓ సినిమా గురించి తెలుసుకుందామా.

OTT Movie: ఊహించని ట్విస్టులు.. ఒక్కో సీన్ మైండ్ బ్లాంకే.. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూస్తే..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2025 | 2:42 PM

Share

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, మర్టరీ మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్ తర్వాత దేశవ్యాప్తంగా అదే స్థాయిలో సినీ ప్రియులలో ఆసక్తిని కలిగించిన సినిమా అది. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. అంతకు మించిన మైండ్ బ్లాక్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే విక్రాంత్ రోణ. కిచ్చా సుదీప్ హీరోగా ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీ, తెలుగులో డిస్ట్రిబ్యూటలర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇందులో సుదీప్ తోపాటు అనూప్ భండారీ సోదరుడు నిరూప్ భండారీ సైతం ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్ చేసింది.

డైరెక్టర్ అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రాంత్ రోణ అనే ఇన్స్పెక్టర్ పాత్రలో సుదీప్ కనిపించాడు. దాదాపు 2 గంటల 28 నిమిషాలపాటు ఈ సినిమా ప్రతి క్షణం క్యూరియాసిటీ కలిగిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ , ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అజనీష్ లోక్ నాథ్ అందించిన మ్యూజిక్ సైతం ఆకట్టుకుంది.

కథ విషయానికి వస్తే..

ఒక గ్రామంలో వరుసగా కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. దీంతో ఆ గ్రామస్తులు చాలా భయపడతారు. గ్రామాన్ని దుష్ట శక్తులు ఆవహించాయని.. మిస్టరీ ఘటనలకు అవే కారణమని స్థానికులు నమ్ముతారు. వీటి గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి విక్రాంత రోణ ఆ గ్రామానికి వస్తాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో అతడికి ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి అనేది సినిమా.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..