AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన హీరోయిన్..

సినీ రంగంలో ఆమె తోపు హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. ఒక్కో సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలకు గట్టి పోటినిస్తుంది. తాజాగా తన కెరీర్ తొలినాళ్లల్లో జరిగిన ఓ చేదు ఘటనను పంచుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2025 | 4:15 PM

Share

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. నటీనటులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో ఈ రంగంలోకి అడుగుపెడుతుంటారు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ కళ్లు అరిగేలా తిరుగుతుంటారు. కొందరు ఆఫర్స్ అందుకుని తమ టాలెంట్ తో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నప్పటికీ.. అదృష్టం కలిసిరాని తారలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నా వారు కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నవారే. అయితే తాను సైతం ఎన్నో సవాళ్లను, ఇబ్బందులను తట్టుకుని ఈ స్థాయికి వచ్చానని.. 19 ఏళ్ల వయసులోనే తనతో ఓ డైరెక్టర్ అనుచితంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది ఓ హీరోయిన్. ఇప్పుడు ఆమె గ్లోబల్ బ్యూటీ. మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా.

ఇటీవల జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్ లో హీరోయిన్ ప్రియాంక చోప్రా పాల్గొంది. ఈ క్రమంలోనే కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. 19 ఏళ్ల వయసులో తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. అప్పటికే సినీరంగంలో ఎలా ఉంటారో తనకు తెలియదని చెప్పుకొచ్చింది. కానీ ఓ సినిమా కోసం సెట్ లోకి వెళ్తే అప్పుడు దర్శకుడిని కలిసి తనకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి నా కాస్ట్యూమ్ డిజైనర్ కు చెప్పండి అని అడిగానని.. అతను తన ముందే కాల్ చేసి చాలా నీచంగా మాట్లాడాడని తెలిపింది.

ప్రియాంక మాట్లాడుతూ.. “ఆ డైరెక్టర్ నా స్టైలీష్ట్ కు కాల్ చేసి హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే అడియన్స్ థియేటర్ కు వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి అంటూ పదే పదే ఆ పదాన్ని ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా అనిపించింది. అలాగే బాధగా ఉండేది. దీంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లాను. వెంటనే మా అమ్మ దగ్గరకు వెళ్లి అతడు నన్ను చిన్నచూపు చూస్తే అసలు సినిమా చేయానని చెప్పేశాను. ఆ సినిమా చేయలేదు. ఇప్పటికీ ఆ దర్శకుడితో కలిసి పనిచేయలేదు. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది” అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు