Marco OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి మోస్ట్ వయలెంట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
గతేడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో మలయాళం మూవీ మార్కో ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజై భారీ వసూళ్లు రాబట్టింది.

యానిమల్, కిల్ సినిమాలను మించి ది మోస్ట్ వయెలెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది మార్కో. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే బెస్ట్ యాక్షన్ సినిమాగా ఆడియెన్స్ ను మెప్పించింది. గతంలో పలు తెలుగు సినిమాల్లో సహాయక నటుడిగా ఆకట్టుకున్న ఉన్ని ముకుందన్ ఇందులో హీరోగా నటించడం విశేషం. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన మార్కో చిత్రం.. ఒక్క మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం విశేషం. ఇక తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ మార్కో సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి. ముఖ్యంగా హిందీలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా మార్కో పేరు తెచ్చుకుంది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఉర్రూత లూగించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. మార్కో మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. మార్కో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. వచ్చేనెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మార్కో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోనీ లివ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో మార్కో మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.
మార్కో సినిమాకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. మార్కో సినిమాలో మితిమీరిన హింసను చూపించారనే అభిప్రాయం ఉంది. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఉన్నీ ముకుందన్ తో పాటు సిద్ధిఖీ, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్, అభిమాన్యు తిలకన్, అన్ సోన్ పాల్, యుక్తి తరేజా, ధ్రువ, శ్రీజిత్ రవి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో మార్కో మూవీని మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ప్రేమికుల రోజు కానుకగా..
Biggest action thriller of Malayalam cinema is coming your way! Get ready for the ultimate adrenaline rush with #Marco, streaming Feb 14 on SonyLIV.@Iamunnimukundan #ShareefMuhammed #CubesEntertainments #HaneefAdeni #RaviBasrur #KabirDuhanSingh #AbhimanyuShammyThilakan pic.twitter.com/rTYVnYwJx2
— Sony LIV (@SonyLIV) January 31, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.