Maha Kumbh Mela: ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి’.. మహా కుంభమేళాలో అమృత స్నానం ఆచరించిన ప్రముఖ హీరోయిన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కు చేరుకుంటున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

పవిత్ర మహాకుంభ మేళాలో పవిత్ర స్నానం చేసేందుకు ప్రతిరోజూ కోట్లాది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇక బుధవారం (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కాగ మహా కుంభమేళాలో పవిత్రసంగమంలో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతాంటారు. అందుకే సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ పుణ్యస్నానాన్ని ఆచరిస్తున్నారు. బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని, దర్శకుడు కబీర్ ఖాన్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, మరాఠీ దర్శకుడు ప్రవీణ్ తర్దే వంటి ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేశారు. ఇప్పుడు వివాదాస్పద నటి పూనమ్ పాండే కూడా ఈ జాబితాలో చేరింది. ఎప్పుడూ బోల్డ్ ఫొటోస్, కామెంట్సో తో నిత్యం వార్తల్లో ఉండే పూనమ్ ఇటీవల ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోందీ అందాల తార. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న చిత్రాలను పంచుకుంది. ఈ ఫొటో క్యాప్షన్ గా ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి’ అని రాసుకొచ్చింది.
పూనమ్ పాండే షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేస్తున్న ఆమె ఫోటోలను చూసి ట్రోల్ చేయడం ప్రారంభించారు. కాగా బుధవారం మహాకుంభ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కూడా పూనమ్ స్పందించింది. “ఇది చాలా దురదృష్టకర సంఘటన. అయితే ఈ ఘటనతో భక్తుల్లో విశ్వాసం, నమ్మకం తగ్గకూడదు. ఓం నమ శివాయ’ ఆని చెప్పింది.
కాగా ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మౌని అమావాస్య కోసం సంగం వద్ద భారీ జనసందోహం ఏర్పడిన సమయంలో తొక్కిసలాట జరిగింది. 30 మంది మరణించారని, 60 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ తెలిపారు.
మహా కుంభమేళాలో పూనమ్ పాండే..
Actress and model Poonam Pandey recently shared glimpses from her visit to Prayagraj, where she participated in the ongoing Maha Kumbh Mela—one of the world’s largest spiritual gatherings. She was seen taking a holy dip in the sacred waters of the River Ganga. pic.twitter.com/LmWSAHpUKZ
— theglamorholic (@Glamorholics) January 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.