AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj: ఆశా భోస్లే మనవరాలు కాదు.. మహ్మద్ సిరాజ్ బౌల్డ్ అయ్యింది ఈ బిగ్ బాస్ బ్యూటీకే!

టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మధ్యన క్రికెట్ తో కాకుండా తన రిలేషన్ షిప్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల అతను ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే తో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. జనై పుట్టినరోజు వేడుకలో వారిద్దరూ నవ్వుతూ ఉన్న కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి

Mohammed Siraj: ఆశా భోస్లే మనవరాలు కాదు.. మహ్మద్ సిరాజ్ బౌల్డ్ అయ్యింది ఈ బిగ్ బాస్ బ్యూటీకే!
Mohammed Siraj
Basha Shek
|

Updated on: Jan 30, 2025 | 1:41 PM

Share

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన రిలేషన్ షిప్ కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఆమె పుట్టినరోజు వేడుకలో వారిద్దరూ నవ్వుతున్న కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో చాలా మంది మహ్మద్ సిరాజ్-జనై లు ప్రేమలో ఉన్నారని భావించారు. అయితే ఈ రూమర్లు ఎక్కువ కావడంతో జనై, సిరాజ్ తమ రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చారు. మొదట సిరాజ్ జనైను సోదరి అని పిలవడం ద్వారా డేటింగ్ పుకార్లకు ముగింపు పలికాడు. ఆ తర్వాత జనై కూడా సిరాజ్ పోస్టుకు లైక్ కొట్టింది. అయితే ఇప్పుడు సిరాజ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడు అతను ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్‌ నటితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఈ భారత స్టార్ బౌలర్ బిగ్ బాస్ ఫేమ్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నాడట. చాలా కాలంగా సిరాజ్, మహిరా శర్మ లు ప్రేమలో మునిగి తేలుతున్నారట. కాగాగతేడాది నవంబర్‌లో మొదటిసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత ఏడాది నవంబర్‌లో బిగ్ బాస్ ఫేమ్ నటి ఫోటోను సిరాజ్ లైక్ కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగా ఈ డేటింగ్ వ్యవహారం మరోసారి ఊపందుకుంది.

ఇంతకుముందు, మహిరా శర్మ బిగ్ బాస్ ఫేమ్ పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. ఇద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో కలుసుకున్నారు. సన్నిహితంగా మెలిగారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా వీరి ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఏమైందో తెలియదు కానీ 2023లో వీరి బంధం బీటలు వారిది. మహిరా శర్మ నటుడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇద్దరు కలిసున్న ఫోటోలను కూడా డిలీట్ చేసింది. పరాస్ ఛబ్రా కూడా పలు సార్లు మహీరాతో డేటింగ్ విషయంపై స్పందించాడు. అలాగే విడిపోయిన వార్తలను కూడా ధృవీకరించాడు. ‘మేము ఒక వారం మాట్లాడుకోలేదు. చిన్న విషయాలకే నిత్యం వాదులాడుకునేవాళ్లం. బిగ్ బాస్ హౌస్‌లో కూడా గొడవ పడేవాళ్లం. అయితే విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదు’ అని పరాస్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మహీరా శర్మ లేటెస్ట్ ఫొటోస్..

ఇక దీని తర్వాత మహ్మద్ సిరాజ్, మహీరా శర్మ లు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై అటు మహ్మద్ సిరాజ్ కానీ మహీరా శర్మ కానీ స్పందించ లేదు. అలాగనీ ఈ రూమర్లను ఖండించలేదు. అయితే ఈ వార్త‌ల‌పై మ‌హిరా త‌ల్లి సానియా శర్మ స్పందించింది. ‘అసలేమి మాట్లాడుతున్నారు. వారిద్దరి మ‌ధ్య ఎటువంటి రిలేష‌న్ లేదు. ప్ర‌జలు ఎదైనా మాట్లాడుతారు. ఇప్పుడు నా కుమార్తె సెలబ్రిటీ కాబట్టి ఇటువంటి వార్త‌లు రావ‌డం స‌హ‌జం’అని చెప్పుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..