AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్లీజ్.. ఒక్కసారి నా కూతురిని కలవండి’.. ఎన్టీఆర్‌ను వేడుకుంటోన్న క్యాన్సర్ పేషెంట్ తల్లి.. మంత్రికి లేఖ

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగాఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈ నందమూరి హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పోగయ్యారు. అలా ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధించే వీరాభిమానుల్లో తెలంగాణ హుజూరాబాద్ కి చెందిన ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఉంది.

'ప్లీజ్.. ఒక్కసారి నా కూతురిని కలవండి'.. ఎన్టీఆర్‌ను వేడుకుంటోన్న క్యాన్సర్ పేషెంట్ తల్లి.. మంత్రికి లేఖ
Jr NTR
Basha Shek
|

Updated on: Jan 30, 2025 | 12:55 PM

Share

ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఎన్టీఆర్ కూడా తన అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తగిన గౌరవమిస్తాడు. సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరైన తన అభిమానులందరినీ జాగ్రత్తగా ఇంటికెళ్లాలని ఒకటికి పది సార్లు చెప్పడం మనం చూసే ఉంటాం. ఇక ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయంగా నిలుస్తుంటాడు ఎన్టీఆర్. ఈ కారణంగానే ఎన్టీఆర్ ను స్వయంగా కలవాలని, అతనితో కాసేపైనా మాట్లాడాలని చాలా మంది కోరుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ తో పోరాడుతోన్న ఓ వీరాభమాని ఎన్టీఆర్ ను కలవాలని, ఆయనతో మాట్లాడాలని పరితపించడం, ఈ విషయ తెలుసుకున్న ఎన్టీఆర్ స్వయంగా ఆ అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడాడు. అంతేకాకుండా ఆ అబ్బాయి హాస్పిటల్ ఖర్చు మొత్తం ఎన్టీఆర్ స్వయంగా భరించారు కూడా. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అమ్మాయి ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాలని ఆశ పడుతుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణలోని హుజూరాబాద్ కి చెందిన స్వాతి(25) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడటం తన చివరి కోరిక అట. ఈ విషయాన్ని స్వాతి తల్లి రజిత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు కోమటిరెడ్డికి రజిత ఒక లేఖ రాశారు. ‘నా కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడాలనేది తన చివరి కోరిక. కాబట్టి తమరు దయ తలి ఎన్టీఆర్ ను కలిపించాల్సిందిగా కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొంది రజిత.

రజిత రాసిన లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందర కంటతడి పెడుతున్నారు. మరి ఈ లేఖ ఎన్టీఆర్ వరకు చేరుతుందా ? ఆయన ఆ క్యాన్సర్ పేషెంట్ ను కలుస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.