AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు స్మితా సబర్వాల్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా?

తెలంగాణాలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాడీ నటుడు. చిన్నప్పుడు చదువుకుంటూనే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. మిమిక్రీ కూడా వంట బట్టించుకున్నాడు. ఇదే క్రమంలో పలు టీవీ షోల్లో పాల్గొని సత్తా చాటాడు.

Tollywood: ఒకప్పుడు స్మితా సబర్వాల్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Comedian
Basha Shek
|

Updated on: Jan 30, 2025 | 4:01 PM

Share

పై ఫొటోలో హీరోలా పోజులిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? హీరో కాకపోయినా అతను ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. తన కామెడీ పంచులు, ప్రాసలతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తెలంగాణలోని ఓ పల్లెటూరుకు చెందిన ఈ పిల్లగాడు చిన్నప్పటి నుంచే హరికథలు, బుర్రకథలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. మిమిక్రీ కూడా నేర్చుకున్నాడు. పలు టీవీ షోల్లో కూడా పాల్గొని సత్తా చాటాడు. సినిమా ఛాన్సుల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. కానీ అదృష్టం దక్కలేదు. అందుకే మళ్లీ ఉద్యోగం బాట పట్టాడు. ప్రముఖ ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర కొంత కాలం పాటు పని చేశాడు. అయితే నటనపై ఆసక్తితో ఉద్యోగం చేయలేకపోయాడు. దీంతో జాబ్ కు రాజీనామా చేసి దుబాయ్ వెళ్లి పోయాడు. అక్కడ రేడియో జాకీగా చేరాడు. తన ప్రోగ్రాంకు మంచి స్పందన రావడంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై సినిమాల్లోకి అడుగు పెట్టాడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తెలంగాణ యాసలో ఈ కమెడియన్ చెప్పే డైలాగులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘తీస్కోలే రొండు లచ్చల కట్నం’, ‘ఒక రెండు నిమిషాలు ఆగుతావా’ వంటి తన దైన ట్రేడ్ మార్క్ డైలాగులతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తన కామెడీతో సిల్వర్ స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసే అతను మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి. ఇది అతని చిన్ననాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ షోతో మంచిగుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చ రవి. అదే సమయంలో సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడి పాత్రలు పోషించి అందరి మన్ననలు అందుకున్నాడు. శతమానం భవతి, గద్దల కొండ గణేశ్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, నారప్ప, బలగం, వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, భీమా, ఓంభీమ్ బుష్, మ్యాడ్, పురుషోత్తముడు, భలే ఉన్నాడే, లగ్గం, ఉత్సవం, కథా కమావీషు తదితర చిత్రాల్లో రచ్చ రవి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.

బాలయ్యతో రచ్చ రవి..

కాగా సినిమాల్లోకి రాక ముందు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి చేరాడు రచ్చ రవి. అక్కడ కొంత కాలం పాటు ప్రముఖ ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని చేశాడు కూడా . అయితే నటనపై ఆసక్తితో మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమాల్లోకి అడుగు పెట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే