AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee With A Killer: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ కాఫీ విత్ ఏ కిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే టాక్ షోలు ప్రేక్షకులకు అందిస్తూ దూసుకుపోతుంది. వెబ్‌సిరీస్‌, సినిమాలు, స్పెషల్‌ షోలు , టాక్ షోలు, గేమ్ షోలతో ఓటీటీలు ఆడియన్స్ కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది ఆహా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Coffee With A Killer: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ కాఫీ విత్ ఏ కిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి
Coffee With A Killer
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2025 | 12:40 PM

Share

ఆర్ పి పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాతగా ఆహా ఓటిటిలో నేటి నుండి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్న చిత్రం “కాఫీ విత్ ఏ కిల్లర్”. టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం క్రైమ్ జోనర్ లా అనిపిస్తుంది. అనుష్ గోరక్ ఈ చిత్రానికి డిఓపి, ఎడిటర్, డిఐ గా వ్యవహరించగా తిరుమల డైలాగులు రాశారు. నేటి నుండి ఆహాలో స్క్రీన్ స్ట్రీమ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా నటుడు అంబటి శ్రీను మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి కాఫీ తాగే ఫీల్ కలిగిస్తుంది. ఈ చిత్రంలో నాకు మంచి పాత్రను ఇచ్చిన ఆర్ పి పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఆయన అంటే నాకు ఎంతో అభిమానం. నేను ఆయన పాటలకు వీరాభిమానిని. ఆర్ పి పట్నాయక్ గారి అభిమానులు ఆయన నుండి ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ రావాలని కోరుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం నిర్మాత సతీష్ గారికి, గౌతం పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎవరికీ కూడా ఈ చిత్ర కథ ఏంటి అనేది తెలీదు. కాబట్టి చిత్రాన్ని అందరూ తప్పకుండా ఆహ్వానం చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

నటి శ్రీరాప మాట్లాడుతూ… “మీడియా వారికి పెద్దలకు అందరికీ నమస్కారం. కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా నేను గౌతమ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఈ చిత్రానికి ఎంత ముఖ్యమైన వ్యక్తి. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఆర్ పి పట్నాయక్ గారు అంటే తెలియని వారు లేరు. ఆయన సంగీత దర్శకుడుగా అలాగ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..