Tollywood: చరిత్ర సృష్టించిన హీరో.. ఒక్క ఏడాదిలోనే 36 సినిమాలతో రికార్డ్.. ఎవరంటే..
సౌత్ ఇండస్ట్రీలోనే ఆయనో సూపర్ స్టార్. ఎన్నో అద్భుతమైన పాత్రలు.. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదిచుకున్నారు. కానీ మీకు తెలుసా.. ఆయన ఒక్క ఏడాదిలోనే 36 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. 70 ఏళ్ల వయసులోనూ హీరోగా యంగ్ స్టార్స్ కు పోటీ ఇస్తున్నారు.

ప్రస్తుతం భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిర్మాణ పనులలో ఆలస్యం, స్పెషల్ ఎఫెక్ట్స్ కారణంగా మూవీ కంప్లీట్ కావడానికి సంవత్సరాలు పడుతుంది. అలాగే పలువురు స్టార్స్ ఒక్క సినిమా కోసం సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. మరికొందరు మాత్రం వెంట వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఒకే సంవత్సరంలో అత్యధిక చిత్రాలలో నటించి రికార్డు సృష్టించిన హీరో గురించి తెలుసా.. ? అవును.. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 36 సినిమాల్లో నటించి హిస్టరీ క్రియేట్ చేసాడు. అతడు మరెవరో కాదు.. మలయాళీ స్టార్ మమ్ముట్టి.
1971లో అనుభవంగల్ పాలిచకల్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 1980లో మేళ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో అత్యంత బిజీగా ఉండే నటులలో ఒకరు అయ్యారు. 1982లో, మమ్ముట్టి 24 సినిమాల్లో నటించాడు. 1983 నుండి 1986 వరకు అతను ప్రతి సంవత్సరం 36, 34, 28, 35 సినిమాల్లో నటించి రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అతని అంకితభావం అతన్ని పరిశ్రమలో కష్టపడి పనిచేసే నటులలో ఒకరిగా చేసింది.
హీరోగా మమ్ముట్టి 400 కి పైగా చిత్రాల్లో నటించారు. . 1983 లో ఒక సంవత్సరంలో 36 చిత్రాల్లో నటించగా.. అతడి తనయుడు దుల్కర్ సల్మాన్ ఆ సంఖ్యను చేరుకోవడానికి ఏకంగా 13 ఏళ్లు పట్టింది. 1983లో ఆయన తీసిన ‘ఆ రాత్రి’ సినిమా కోటి రూపాయలు వసూలు చేసిన తొలి మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కూడేవిడే, అదియోజుక్కుకల్ వంటి ఇతర హిట్ చిత్రాలతో సూపర్ స్టార్ డమ్ అందుకున్నాడు. మమ్ముట్టి తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును మతిలుకల్ చిత్రానికి అందుకున్నాడు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (2000) చిత్రంలో ఆయన పాత్ర అతనికి మరో జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.మమ్ముట్టి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించారు. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన