- Telugu News Photo Gallery Cinema photos Know Actress Tamannah Bhatia Net Worth and Her Car Collections
Tollywood : 18 ఏళ్లుగా సినిమాలు.. రూ.120 కోట్లకు మహారాణి.. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. 2005లో ఓ హిందీ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత 2006లో తెలుగు తెరకు పరిచయమైంది. దాదాపు 18 సంవత్సరాలుగా సినీరంగంలో వరుస సినిమాల్లో నటిస్తోన్న హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే.. తెలుగులో ఆమె చాలా ఫేమస్ .
Updated on: Feb 15, 2025 | 9:26 AM

సినీరంగంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తసుకుంటుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.120 కోట్లు.

ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది. ఆ తర్వాత 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.

తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. డిసెంబర్ 21, 1989న ముంబైలో జన్మించింది తమన్నా.

నివేదికల ప్రకారం తమన్నా ఆస్తులు రూ.120 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే ఆమె ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఆమె సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్ తో అత్యధికంగా సంపాదిస్తుంది.

తమన్నా వద్ద రూ.43.50 లక్షల విలువైన BMW 320i, రూ.1.02 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ GLE, రూ.29.96 లక్షల విలువైన మిత్సుబిషి పజెరో స్పోర్ట్ ఉన్నాయి. అలాగే రూ.75.59 లక్షల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఉన్నాయట.





























