- Telugu News Photo Gallery Cinema photos Valentines Day: Sukesh Chandrasekhar Gifts Private Jet To Bollywood Actress Jacqueline Fernandez
Jacqueline Fernandez: వాలంటైన్స్ డే స్పెషల్.. సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు కానుకగా ఏం పంపించాడో తెలుసా?
మనీలాండరింగ్, చీటింగ్ కేసుల్లో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తరచూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. తాజాగా వాలెంటైన్స్ డే ను పురస్కరించుకుని స్టార్ హీరోయిన్ కు ఒక ప్రత్యేక ప్రేమ లేఖ పంపాడు సుఖేష్. అందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి ఒక స్పెషల్ బహుమతి ఇస్తున్నట్లు తెలిపాడు.
Updated on: Feb 14, 2025 | 11:32 PM

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా ఉన్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి . కాగా వందల కోట్ల రూపాయల మోసం కేసులో సుఖేష్ చంద్రశేఖర్ జైలు పాలయ్యాడు.

జైలుకు వెళ్లిన తర్వాత కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పట్ల తన ప్రేమను చూపించడం ఆపలేదు సుకేశ్ చంద్ర శేఖర్. అతను జైలు నుండి చాలాసార్లు ఉత్తరాలు రాశాడు. ఈసారి అతను వాలెంటైన్స్ డేకి ఇంకా పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

సుకేశ్ చంద్ర శేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఒక ప్రైవేట్ జెట్ ను బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఒక ప్రేమ లేఖను కూడా పంపించాడు.

జాకీ, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను.' నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ వాలెంటైన్ వి. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. వాలెంటైన్స్ డే మనకు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. మన తప్పులను క్షమించి, ఒకరినొకరు అంగీకరించే రోజు ఇది' అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో రాసుకొచ్చాడు.

'ఈ వాలెంటైన్స్ డే నాడు నేను మిమ్మల్ని ఆశ్చర్యపరచకుండా ఉండగలనా?' ఈ సంవత్సరం వాలెంటైన్స్ డేకి నేను మీకు గల్ఫ్‌స్ట్రీమ్ జెట్‌ను బహుమతిగా ఇస్తున్నాను' అని లేఖలో పేర్కొన్నాడు సుకేష్.

మరి వీటన్నింటికీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని హీరోయిన్ ఇప్పటికే పలు సార్లు దర్యాప్తు అధికారులను కోరింది.





























