- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Had Fake Videos Of Her At Career Start, She Is Anika Surendran
Tollywood: 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్.. కట్ చేస్తే.. టాలీవుడ్లో తోపు హీరోయిన్..
సినీరంగంలోకి చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే బాలనటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అలరించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ వెండితెరపై సందడి చేసింది. కానీ ఈ అమ్మడు 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్ భారీన పడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..
Updated on: Feb 15, 2025 | 1:22 PM

సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా ఫేమస్ అయ్యింది. స్టార్ హీరోలకు కూతురిగా, చెల్లిగా నటించి పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై సందడి చేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అనిక సురేంద్రన్. చిన్న వయసులోనే ఫేక్ వీడియోస్ బారిన పడింది ఈ అమ్మడు. సినీరంగంలో నటిగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఫేక్ ఫోటోస్, వీడియోలను నెట్టింట షేర్ చేశారు.

కానీ ఆ సవాళ్లను అధిగమించి ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యింది. కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో మరింత పాపులర్ అయ్యింది అనిక సురేంద్రన్. ఆ తర్వాత హీరోయిన్ గాను మారింది.

18 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమాతో సందడి చేసింది. ఇప్పుడు తెలుగుతోపాటు తమిళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది.

మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అనిక. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.




