Kanchana 4 : హారర్ సినిమాతో భయపెట్టనున్న బాలీవుడ్ బ్యూటీ.. కాంచన 4లో క్రేజీ హీరోయిన్..
స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ పాటలతో సినీ ప్రియులను హృదయాలను గెలుచుకుంది. ఇక సినీ రంగుల ప్రపంచంలో గ్లామర్ అరాచకం సృష్టించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హారర్ కామెడీ చిత్రంలో నటిస్తుందట. ఇన్నాళ్లు అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ వయ్యారి ఇప్పుడు భయపెట్టేందుకు రెడీ అయ్యింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీప్రియులకు ఎంతగానో ఇష్టమైన హారర్ కామెడీ చిత్రాల్లో కాంచన ఒకటి. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఇప్పటివరకు కాంచన 1, 2, 3 పార్ట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తాజాగా కాంచన 4 సైతం రాబోతుంది. అయితే ఈ మూవీలో ఎప్పటిలాగే సౌత్ హీరోయిన్స్ కాకుండా.. ఈసారి బాలీవుడ్ బ్యూటీ జాయిన్ కానుందట. తాజాగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఇన్నాళ్లు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించిన ఈ వయ్యారి.. ఇప్పుడు హారర్ కామెడీ మూవీతో భయపెట్టేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇంకెవరు బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహి. ఈ నటి తన రాబోయే సినిమా చిత్రీకరణను ఇప్పటికే ప్రారంభించిందని టాక్.
దిల్బర్ పాటతో పాన్ ఇండియా సినీ ప్రపంచంలో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది నోరా ఫతేహి. ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు గ్లామర్ స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. తెలుగులోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కాంచన 4లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. లారెన్స్ రాఘవ స్వీయదర్శకత్వంలో వచ్చిన కాంచన సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
2007లో ముని సినిమాతో ఈ హారర్ కామెడీ సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన రాఘన లారెన్స్.. ఆ తర్వాత 2011లో ముని 2, తర్వాత కాంచన, కాంచన 2, 3 చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. వరుసగా ఈ హారర్ కామెడీ ఫ్రాంచైజీలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ.. ఇప్పుడు కాంచన 4 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అంతకు ముందు ఈ సినిమాకు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ సైతం నటించనున్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే నోరా ఫతేహి గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. నోరా ఫతేహి చివరిసారిగా “మడ్గావ్ ఎక్స్‌ప్రెస్” లో కనిపించింది.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన