- Telugu News Photo Gallery Cinema photos Maha Kumbh Mela 2025, This Actress makes holy dip in Prayagraj, she is Sonal Chauhan
Mahakumbh 2025: త్రివేణి సంగమంలో టాలీవుడ్ హీరోయిన్.. మహా కుంభమేళాలో మెరిసిన బ్యూటీ..
కొన్ని రోజులుగా ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేడుక ఈ నెల 26 వరకు జరగనుంది. దాదాపు 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో దేశవిదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు.
Updated on: Feb 13, 2025 | 4:32 PM

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు. మరోవైపు ఈ మహా కుంభమేళాకు సెలబ్రెటీలు సైతం క్యూ కట్టాయి. ఇప్పటికే చాలా మంది సినీతారలు ప్రవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు.

ఇప్పటికే విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మీనన్, శ్రీనిధి శెట్టి, బింధుమాధవి, ప్రియాంక జైన్, రాజ్ కుమార్ రావు వంటి సినీతారలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా మరో హీరోయిన్ కుంభమేళాలో సందడి చేసింది.

ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. సంప్రదాయంగా పద్దతిగా దుస్తులు ధరించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసింది. తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సోనాల్ చౌహన్ హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ ఆమె తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. రెయిన్ బో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి చిత్రాల్లో బాలకృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

అలాగే పండగ చేస్కో, షేర్, ది ఘోస్ట్, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది సోనాల్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

అలాగే ఇప్పుడు ఈ బ్యూటీకి హిందీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అంతగా క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోతుంది. నెట్టింట నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సోనాల్. తాజాగా ఆధ్యాత్మక యాత్ర పిక్స్ పంచుకుంది.





























