Tollywood: కోటి ఇచ్చిన గ్లామర్ పాత్రలు చేయను.. తెగేసి చెప్పిన హీరోయిన్..
ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వివాహం తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్ గా లేదు. కానీ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్.. మలయాళీ సినీపరిశ్రమలో ఆమె నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా సందడి చేస్తుంది. అయితే తనకు రూ.కోటి ఇచ్చినప్పటికీ గ్లామర్ పాత్రలు చేయనని చెప్పుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ సంవృత సునీల్. ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ మలయాళీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. 1998లో వచ్చిన ‘అయాల్ కథ ఎతువుక్కు’ సినిమాలో చిన్న పాత్ర పోషించినప్పటికీ, సంవృత 2004లో వచ్చిన ‘రసికన్’ సినిమాలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంవృత సునీల్ మాట్లాడుతూ.. ” కోటి రూపాయలు పారితోషికం ఇచ్చినా గ్లామరస్ పాత్రలు చేయను. డబ్బు లేదా కీర్తి కంటే శాంతి, ఆనందం వీటిని ఎక్కువగా విలువైనదిగా భావిస్తాను. అందరుక నాకు గౌరవం ఇస్తారు. ఇప్పుడు దానిని కోల్పోవాలని నేను కోరుకోవడం లేదు. నేను సూపర్ స్టార్ హోదాను కోరుకోవడం లేదు. నా కుటుంబం, స్నేహితులు అందరూ నా సినిమాల గురించి చాలా గర్వంగా మాట్లాడుకుంటారు. నా సినిమాలు టీవీలో వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. వారందరికీ నాపై చాలా గౌరవం ఉంది. నేను ఈ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుండి సినిమా పరిశ్రమలో ఎప్పుడూ చెడు అనుభవం ఎదురుకాలేదు. దానికి కారణం నేను చేసిన సినిమాలు, నేను పోషించిన పాత్రలు. నేను దానిని కోల్పోవాలనుకోవడం లేదు.” అని సంవృత చెప్పింది.
సంవృత సునీల్, అఖిల్ జయరాజ్ 2012 లో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత, సంవృత అమెరికాకు వెళ్లింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన