Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: నో కాంప్రమైజ్ అంటున్న సాయి పల్లవి.. రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడలేమా..?

సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడలేమా..? మిగిలిన హీరోయిన్స్ అంతా అవకాశాల కోసం కాస్తైనా పట్టు విడుస్తున్నారు.. అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా ఛాన్సుల కోసం గ్లామర్ షోకి సై అంటున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. మరి కెరీర్ అంతా ఇలాగే ఉంటారా..? నో కమర్షియల్ సినిమా అంటారా..?

Prudvi Battula

|

Updated on: Feb 09, 2025 | 7:25 AM

సాయి పల్లవి.. ఇది పేరు కాదు.. బ్రాండ్. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు.. తన వల్లే సినిమాలు ఆడే స్థాయికి ఎదిగారు సాయి పల్లవి. కెరీర్ మొదట్నుంచీ తనదైన దారిలోనే వెళ్తున్నారు కానీ కమర్షియల్ సినిమాల కోసం తనను తాను మార్చుకోలేదు ఈ బ్యూటీ.

1 / 5
ఇప్పటికీ పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తున్నారు. ఫిదా నుంచి మొదలు పెడితే.. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే. మధ్యలో ఎంసిఏ మాత్రమే రొటీన్ కమర్షియల్ సినిమా.

2 / 5
ఆ తర్వాత మళ్లీ అలాంటి పాత్రల జోలికే వెళ్లలేదు ఈ భామ. గతేడాది అమరన్‌లో శివకార్తికేయన్‌కు ధీటుగా నటించారు పల్లవి.. తాజాగా తండేల్‌లోనూ చైతూను డామినేట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

3 / 5
తండేల్‌కు ఇంత క్రేజ్ రావడానికి చైతూతో పాటు సాయి పల్లవి కూడా మేజర్ రీజన్. అలాగే హిందీలో రామాయణ్‌ సినిమాలో సీతగా నటిస్తున్నారు ఈ భామ. 2026, 2027 దీపావళికి ఈ రెండు భాగాలు రానున్నాయి.

4 / 5
దీని బట్టి మరో రెండు మూడేళ్ళ వరకు కూడా సాయి పల్లవిని రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూడటం కష్టమే. మొన్న సందీప్ వంగా కూడా తండేల్ వేడుకలో ఇదే చెప్పారు. ఆమె గురించి కొన్ని విషయాలు కూడా పంచుకొన్నారు. 

5 / 5
Follow us