- Telugu News Photo Gallery Cinema photos Prabhas and Allu Arjun say that they are going to show what a festival is on Ugadi Day
Festival: ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ.. వీరి ఫెస్టివ్ మోడ్‌కి రీజన్ ఏంటి?
పండగంటే ఏంటి? ఇల్లంతా, మనసంతా, మన అనుకున్న వాళ్లంతా, చుట్టు పక్కల అంతా ఆనందంగా కనిపించాలి.. అంతేగా! మరి మన అనుకున్న వాళ్లు ఆనందంగా ఉండాలంటే, సిసలైన పండగకు అర్థం చెప్పాలంటే... ఏం చేయాలో మేం ఉగాది రోజు చేసి చూపించబోతున్నామని అంటున్నారు ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. ప్యాన్ ఇండియా స్టార్ల ఫెస్టివ్ మోడ్‌కి రీజన్ ఏంటి?
Updated on: Feb 09, 2025 | 6:50 AM

పుష్ప2 ది రూల్ ఓపెనింగ్ యాక్షన్ ఎపిసోడ్‌ని రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ఎన్నాళ్లుగానో దీని కోసం వెయిటింగ్ అంటూ తెగ చూసేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఖుషీలో ఉన్నవారికి లడ్డూ లాంటి వార్త అందుతోంది... అది కూడా నెక్స్ట్ సినిమా గురించి... యస్.. మీరు ఊహిస్తున్నది కరెక్టే.. త్రివిక్రమ్ - ఐకాన్ స్టార్ సినిమా గురించి పండగలాంటి వార్త వైరల్ అవుతోంది ఫిల్మ్ నగర్‌లో.

ఇంతకు ముందు ఎవరూ చూడనిది. ఎవరూ ఊహించలేనిది.. మేకింగ్‌కే ఎంతో సమయం పడుతుంది.. ఇండియన్ స్క్రీన్ మీద సరికొత్తగా ఉండబోతోంది అంటూ బన్నీ - త్రివిక్రమ్ సినిమా గురించి ఇప్పటికే హైప్ మామూలుగా లేదు. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర నయా రికార్డులు తిరగరాయకుండా వెనక్కి తిరిగిన చరిత్ర కూడా లేదు. ఐకాన్ స్టార్‌తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు ఉగాది రోజు ముహూర్తం ఫిక్స్ చేశారు.

అదే ఉగాది రోజున మా సినిమా ముహూర్తం కూడా ఉందంటోంది స్పిరిట్ యూనిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావడంతో ప్యాన్ ఇండియా అటెన్షన్ ఎక్కువగా ఉంది ఈ ప్రాజెక్ట్ మీద.

స్పిరిట్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఎలా ఉంటారో ఎప్పటి నుంచో ఊహించుకుంటూ ఉన్నారు జనాలు. యానిమల్ కా బాప్ అన్నట్టుంటుందని సందీప్ చాలా సార్లు చెప్పినా, ఇంకొంచెం లీకులు ఇస్తారా అనే రిక్వస్టులు అందుతున్నాయి ఫ్యాన్స్ నుంచి. యానిమల్ వర్సెస్ సలార్ కట్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

సో ఈ ఉగాది ఐకాన్‌స్టార్, రెబల్‌స్టార్ ఫ్యాన్స్‌కి సిసలైన పండగవాతావరణాన్ని తెచ్చిపెట్టబోతోందన్నమాట. మరి ఒక రోజు మొదలు కానున్న సినిమాలు ఒకే డేట్‌కి విడుదల కానున్నాయా.? ఇదే జరిగేతే ఫ్యాన్స్ మధ్య రచ్చ మామూలుగా ఉండదు.





























