Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటీటీలు నిర్మాతలకు వరమా ?? శాపమా ??

ఇప్పుడున్న సిట్చువేషన్‌లో సినిమా బడ్జెట్‌ని ఎలా డిసైడ్‌ చేస్తారు? ఓటీటీల ద్వారా ఎంతొస్తుంది? శాటిలైట్‌ ఎంత చేస్తుంది? అదర్‌ లాంగ్వేజెస్‌ మార్కెట్‌ ఎలా ఉంది? ఓవర్సీస్‌ని ఎంతకు అమ్మవచ్చు.. ఇతరత్రా ఏం చేయగలుగుతాం.. ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు ప్రొడ్యూసర్‌ మనసులో ఇమీడియేట్‌గా జరిగే క్యాల్కులేషన్స్ ఇవి... ఈ లెక్కలు వేసుకునే నిర్మాతలు ఒకసారి అల్లు అరవింద్‌ మాటలను కూడా పట్టించుకోవాలన్నది ట్రేడ్‌ పండిట్స్ చెబుతున్న మాట. ఇంతకీ ఏస్‌ ప్రొడ్యూసర్‌ ఏమన్నారు?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Feb 09, 2025 | 9:54 PM

తండేల్‌ సినిమా ఔట్‌పుట్‌ చూసుకుని కడుపునిండిపోయింది అల్లు అరవింద్‌కి. అందుకే ఆయన సినిమాను ముందుండి ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఓటీటీ మార్కెట్‌ గురించి మాట్లాడారు. ఓటీటీల్ని నమ్ముకుని సినిమాలు తీసే రోజులు పోయాయని చెప్పారు అల్లు అరవింద్‌.

1 / 5
సగం పెట్టుబడి ఓటీటీల నుంచి వచ్చేస్తుందని ధైర్యంగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నవాళ్లున్నారన్నారు ఈ సీనియర్‌ ప్రొడ్యూసర్‌. క్యాలండర్‌ ఇయర్‌ని తయారు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు.

2 / 5
ఏ నెలలో ఏ ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో ముందుగానే డిసైడ్‌ అవుతున్నాయి. వాటిని బట్టే డీలింగ్స్ జరుగుతున్నాయి. ఆ డీలింగ్స్ ప్రకారమే సినిమాలను రిలీజ్‌ చేసుకోవాల్సిన సిట్చువేషన్‌ ఉంది ఇండస్ట్రీలో.

3 / 5
ఒకవేళ సినిమా బావుండి సూపర్‌ డూపర్‌ హిట్‌ అయితే, సినిమా రిలీజ్‌కి ముందే ఓటీటీ డీల్‌ జరగకపోయినా ఓకే. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడం కోసం ఓటీటీ సంస్థలు ఎటూ పోటీ పడతాయి. కానీ, సినిమాలు కాస్త అటూ ఇటూ అయితే పరిస్థితి ఏంటి? పెద్ద సినిమాలైనా పట్టించుకోవట్లేదు ఓటీటీలు.

4 / 5
ఈ విషయాన్ని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాలు కూడా ఓటీటీలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ని డిసైడ్‌ చేసుకుంటున్నాయి. ముందు డీల్‌ జరగకపోతే, ఆఫ్టర్‌ రిలీజ్‌ పట్టించుకునేవారు ఉంటారో లేదో.. మొదటికే మోసం వస్తుందేమో అనే డైలమా కూడా కనిపిస్తోంది.

5 / 5
Follow us